YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుప్రీం తీర్పుతో జగన్ కుఊపిరి

సుప్రీం తీర్పుతో జగన్ కుఊపిరి

న్యూఢిల్లీ, జనవరి 18, 
ఏపీలో రాజకీయం ఇపుడు గుడులూ గోపురాల చుట్టూ తిరుగుతోంది. దాన్ని పెద్ద గీత గీసి మేలి మలుపు తిప్పడానికి జగన్ సర్కార్ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిందని అంటున్నారు. కేంద్రం తాజాగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విషయంలో వచ్చిన అభ్యంతరాలు, వేసిన ప్రజావ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం కొట్టివేసింది. ఈ తీర్పు ఇపుడు జగన్ సర్కార్ కి భారీ ఊరటను ఇచ్చేదిగా ఉందని మేధావులు, న్యాయ కోవిదులు అంటున్నారు.ప్రభుత్వాలు అయిదేళ్లకు ఒకమారు ఎన్నుకోబడుతాయి. వారి బాధ్యత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడం, ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం. అలా జగన్ సర్కార్ ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో మొదటిది మూడు రాజధానులు అని చెప్పవచ్చు. రెడీ మేడ్ సిటీ విశాఖలో పాలనా రాజ‌ధాని ఏర్పాటు, కర్నూలు వాసుల చిరకాల వాంచ అయిన హైకోర్టుని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా సముచితమైన నిర్ణయం తీసుకుంది. దీని మీద చట్టాన్ని కూడా చేసింది. అయితే అది హై కోర్టులో ఇపుడు న్యాయ విచారణలో ఉంది.
అయితే పాలనాపరమైన అధికారాల విషయంలో కోర్టుల జోక్యం ఎక్కడా ఉండని న్యాయ కోవిదులు, మేధావులు అంటున్నారు. ప్రభుత్వం దైనందిన పాలనలో న్యాయ స్థానాలు తలదూర్చవని చెబుతున్నారు. దానికి కేంద్రం తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మీద దాఖలైన పిల్ ని సుప్రీం కోర్టు కొట్టివేయడమే అచ్చమైన ఉదాహరణగా చెబుతున్నారు. కోర్టులు చూసేది చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధత మాత్రమే. అంతకు మించి కోర్టులు ముందుకు పోవు అని మేధావులు అంటున్నారు. ఇపుడు సుప్రీం కోర్టు కూడా పిల్ ని కొట్టివేయడం ద్వారా మోడీ సర్కార్ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకుని జగన్ సర్కార్ కనుక న్యాయం కోసం మళ్ళీ కోర్టుల గడప ఎక్కితే సానుకూల ఫలితాలు వస్తాయని అంటున్నారు.ఒక ప్రభుత్వం తన అయిదేళ్ళ పాలనలో చేసే పనుల మీద అసలైన తీర్పరులు జనాలే. ఎందుకంటే ప్రభుత్వాలు వాటి అధికారాలు ఎపుడూ శాశ్వతం కావు. అయిదేళ్ళ కాల పరిమితిలో జరిగిన వాటిని బేరీజు వేసి తీర్పును ఓట్ల ద్వారా జనాలు ఇస్తారు. ఇక ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా వీటిని దృష్టిలో కచ్చితంగా పెట్టుకునే ఉంటాయి. ఈ క్రమంలో వారు అతి ఉత్సాహంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారా లేదా అన్నదే సమీక్ష చేయాలి. ఆ విధంగా చూసుకున్నపుడు రాష్ట్ర శాసన సభ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుల విషయంలో కూడా రాజ్యాంగ బధ్ధత ఉందని అనే వారూ ఉన్నారు. మరి దీని మీద జగన్ సర్కార్ కనుక కోర్టు తలుపు తట్టి సుప్రీం తీర్పుని ఉటంకిస్తే పరిణమాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Related Posts