YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మౌనమే రజనీ సమాధానమా

మౌనమే రజనీ సమాధానమా

చెన్నై, జనవరి 18, 
తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో రజనీకాంత్ బరిలోకి దిగడం లేదని తేలిపోయింది. ఆయన సేవా కార్యక్రమాలకే పరిమితమవుతారని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. అయితే రజనీకాంత్ మద్దతు కోసం ఆయనపై కొన్ని పార్టీలు వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పార్టీ పెట్టకపోయినా ఈసారి తమకు మద్దతు ప్రకటించాలని కీలకమైన పార్టీలు కోరుతుండటంతో రజనీకాంత్ పై వత్తిడి మరింత పెరుగుతోంది. రజనీకాంత్ పార్టీ పెట్టాలని భావించారు. ఇందుకోసం మండ్ర ను స్థాపించి సభ్యత్వాలను కూడా కోటిన్నరకు పైగానే చేర్పించారు. తన రాజకీయ సలహాదారులను కూడా రజనీకాంత్ నియమించుకున్నారు. కొద్ది గంటల్లో పార్టీ ప్రకటన ఉంటుందనుకున్న నేపథ్యంలో రజనీకాంత్ అనారోగ్యం పాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాజకీయ పార్టీ ఆలోచనను విరమించుకోవాలని ఆయనకు సన్నిహితులు కూడా సలహా ఇవ్వడంతో ఆయన తన అభిమానులకు క్షమాపణ చెప్పిి మరీ బరి నుంచి తప్పుకున్నారు.కానీ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టకపోయినా ఆయన వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారు. ఆయనకు తమిళనాడు మొత్తం లక్షల సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారి మద్దతు కోసం కీలక పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. రజనీకాంత్ ప్రచారం చేయకపోయినా తమకు మద్దతిస్తున్నట్లు ఒక ప్రకటన చేస్తే సరిపోతుందని రజనీకాంత్ పై వత్తిడి తెస్తున్నారు. దీంతో రజనీకాంత్ మరింత ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.తమిళనాడులో డీఎంకే ఇప్పటికే రజనీకాంత్ పార్టీ పెట్టడాన్ని వ్యతిరేకించింది. ఆయనపై స్థానికేతరుడని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా రజనీకాంత్ పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాలతో తాను పార్టీ ప్రకటనను రద్దు చేసుకున్నప్పటికీ ఇప్పుడు మద్దతు కోసం వత్తిడి చేస్తుండటం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రజనీకాంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అసలు మద్దతిస్తారా? లేదా మౌనంగానే ఉంటారా? అన్నది మరికొద్దిరోజుల్లో తెలియనుంది.

Related Posts