YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కాస్టింగ్ కౌచ్ పై సినీ రంగ పెద్దల సదస్సు

కాస్టింగ్ కౌచ్ పై సినీ రంగ పెద్దల సదస్సు

కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. అన్న‌పూర్ణ స్డూడియో సెవెన్ ఎక‌ర్స్‌లో జ‌రిగిన ఈ స‌మావేంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నిర్మాతల మండలి, నటీనటుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన విస్తృతస్థాయి భేటీలో కాస్టింగ్ కౌచ్‌, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. స‌మావేశం త‌ర్వాత సినీ ప్ర‌ముఖులు ఎవ‌రు మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్ళిపోయారు.అన్నపూర్ణ సినీ స్టూడియోస్ లో ఈ రోజు ఉదయం ప్రారంభమైన సినీ పెద్దల సమావేశం కొంచెం సేపటి క్రితం ముగిసింది. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించే నిమిత్తం 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించారు. 

అయితే, సమావేశానంతరం, మీడియాతో మాట్లాడకుండానే సినీ పరిశ్రమ పెద్దలు వెళ్లిపోవడం గమనార్హం. కాగా, ఈ సమావేశానికి అగ్రహీరో పవన్ కల్యాణ్ హాజరవుతారని ముందు చెప్పినప్పటికీ, భద్రతా కారణాల రీత్యా ఆయన హాజరు కాలేదు. 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అవుతారని, ఈ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.  కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని స‌మాచారం.

Related Posts