YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎక్సైజ్ శాఖను షాక్ కు గురిచేసిన మద్యం అమ్మకాలు

ఏపీ ఎక్సైజ్ శాఖను షాక్ కు గురిచేసిన మద్యం అమ్మకాలు

దసరా,సంక్రాంతి పండుగొచ్చిందంటే కేసు బీర్లు లిక్కర్ ను స్టాక్ తెచ్చుకుంటారు మందు బాబులు. తెలంగాణలో దసరాకు మద్యం ఏరులై పారుతుంది. ఏపీలో సంక్రాంతికి ఆ జోష్ ఉంటుంది.  అయితే ఈసారి మాత్రం సంక్రాంతి పండుగ ఏపీలో తేలిపోయింది.ఏమైందో కానీ మందుబాబులు చుక్కను తగ్గించేశారు. మద్యాన్ని కంట్రోల్ చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి మద్యం వినియోగం తగ్గిపోయింది. 2020 సంక్రాంతి మూడు రోజుల్లో కలిపి 438729 మద్యం బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జనవరి 13 1415 వ తేదీల్లో 402203 మాత్రమే మద్యం బీరు కేసులు అమ్ముడయ్యాయి.గత ఏడాది కంటే ఈ సంవత్సరం 36526 మద్యం కేసులు తక్కువగా అమ్మడం ఏపీ ఎక్సైజ్ శాఖను షాక్ కు గురిచేసింది. అయితే పక్కరాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం ఏపీలోకి రావడమే ఏపీలో అమ్మకాలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.ఏపీలో మద్యం ధరలు భారీగా ఉండడం.. పక్కరాష్ట్రాల్లో మంచి బ్రాండ్లు లిక్కర్ ధరలు చీప్ గా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.ఇక ఎప్పటిలాగానే ఏపీలో 2021 సంక్రాంతి మద్యం అమ్మకాల్లోనూ భారీ జనాభా ఆర్థికంగా బాగా ఉన్న జిల్లాలైన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషంగా చెప్పొచ్చు.

Related Posts