YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడు జిల్లాల కార్యకర్తలతో జనసేనాని భేటీ

 మూడు జిల్లాల కార్యకర్తలతో జనసేనాని భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని మూడు జిల్లాల పార్టీ కార్యకర్తలతో మరి కొద్ది పేపటిలో భేటీ కానున్నారు. కొండగట్టు నుంచి పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర చలోరే చల్ ను నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి కరీంనగర్ లోని ఓ హోటల్ లో బస చేసిన ఆయన ఈ రోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇక్కడి శుభం గార్డెన్ లో ఈ భేటీ జరగనుంది. పవన్ తను బస చేసిన హోటల్ నుంచి శుభం గార్డెన్ కు బయలు దేరారు. తెలంగాణలో మూడు రోజుల పాటు సాగనున్న చలోరే చల్ యాత్రలో ఇది రెండో రోజు.

Related Posts