నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడబోనని భువనగిరి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు అయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం రహదారి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మృతితో ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవని పక్షంలో రాజకీయాల గురించి మాట్లాడబోను ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఐకేపీ సెంటర్లు బంద్ పెడితే టీఆర్ఎస్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నాయకులను రైతులు ఉరికించి కొడతారు అన్నారు రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ సర్కారు మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు కెసిఆర్ అవినీతిపై బిజెపి రాజీ పడ్డ తాము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు కేసీఆర్ స్వగ్రామం చింతమడక లో ఉన్న ప్రజలు ఉన్న అమెరికాలో ఉన్న ప్రజలకు డబ్బులు ఇచ్చినా కేసీఆర్ యాదగిరిగుట్టలో షాపులు ఇళ్లు కోల్పోయిన వారికి ఇచ్చే విషయంలో ఎందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ నాగార్జునసాగర్ లో ఎన్నికలు వస్తున్నాయంటే నిధులు మంజూరు చేస్తున్నారని ఎన్నికల గురించి ఏడు సంవత్సరాలుగా పట్టించుకోని నాయకులు గొర్రెల పంపిణీ చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మత రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు జిల్లా మంత్రి యాదాద్రి కి అతి దగ్గరలో ఉన్న భువనగిరి పట్టణంను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి కోట్లాది నిధులు తెచ్చి భువనగిరి అభివృద్ధి చేపడుతుందని ఆయన పేర్కొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ మరోవైపు పోరాటాలు చేస్తున్నామని వెల్లడించారు నాగార్జునసాగర్ జానారెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అని ప్రజలు అంటున్నారు యాదగిరిగుట్ట లోని ఫామ్ హౌస్ వెళ్లేందుకు రోడ్డు కోసం ఇల్లు కోల్పోయిన బాధితులకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మూడు సంవత్సరాల నుండి డీఎస్సీ నోటిఫికేషన్ లేక వేలాది సంఖ్యలో పాఠశాలలు మూతపడ్డాయని ప్రైవేటు అధ్యాపక ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటన్నిటికీ కేసీఆర్ కారణం అన్నారు తలపెట్టిన రాజ్ భవన్ ముట్టడి ని ఎట్టిపరిస్థితుల్లో చేసి తీరుతామని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు.