నెల్లూరు జనవరి 18
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి హిందూ సాంప్రదాయ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక చేయూత నివ్వాలని నెల్లూరు జిల్లా బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి భారతీయుల దగ్గరకు వెళ్లి సమర్పణా నిధి సేకరించాల్సిన బాధ్యత భారతీయ ప్రతి పౌరుడికి ఉందన్నారు. సమర్పణ నిధి సేకరరణలో భాగంగా నెల్లూరు 16,17 వ డివిజన్లలో ఇల్లుల్లు తిరిగి రామమందిర నిర్మాణం పై అవగాహన కల్పిస్తూ, సమర్పణ నిధులను సమీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు కరణం భాస్కర్,నాగరాజ రెడ్డి , సాయి,మల్లికార్జున, శ్రీనివాసులు నాయుడు, రాములు ,చౌదరి తదితరులు పాల్గొన్నారు.