YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతు ఉద్యమం తీవ్రతరం చేస్తాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

రైతు ఉద్యమం తీవ్రతరం చేస్తాం   సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

జగిత్యాల జనవరి 18  
:నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక, అగ్రి చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనట్లయితే దేశవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.సోమవారం కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా ఉన్నా ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ చట్టంలో ఎక్కడా కూడా మద్దతు ధర విషయం గానీ కొనుగోలు విషయం గానీ ప్రస్తావన లేదు కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులను మభ్యపెట్టేందుకు కొనుగోలు చేస్తాం మద్దతు ధర ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎందుకు చట్టాల్లో పొందుపరచ లేదన్నారు. రైతులు ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చు అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం సన్న చిన్న కారు రైతులు ఎక్కడికి వెళ్లి అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఈ చట్టాల విషయంలో సుప్రీం కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీలో నలుగురు సభ్యులను చేర్చగా వారంతా కూడా గతంలో ఈ వ్యవసాయ చట్టాల అమలు చేయాలని చెప్పిన వ్యక్తి లేకపోవడం అంతేకాకుండా కమిటీ లో ఉన్నటువంటి ఉపేంద్ర సింగ్ మాను రాజీనామా చేయడం చట్టాల్లో రైతులకు ఎలాంటి మేలు జరిగే విషయాలు లేవని ఉద్దేశంతోనే ఉపేంద్ర సింగ్ మాను రాజీనామా చేసినట్లు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎముకలు కొరికే చలిలో కూడా గత రెండు నెలలుగా రైతులు చేస్తున్న ధర్నాలో సుమారు 45 మందికి పైగా రైతులు మరణించడం జరిగిందని , వారి కుటుంబాలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.ఈ నెల 24వ తేదీన ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్న విశ్వనాథం , జిల్లా కార్యదర్శి ఏర్ధండి  భూమయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుతారి రాములు, ఎండి ముక్రం, పట్టణ కార్యదర్శి  ఎన్నాం రాధ,అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related Posts