YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కృష్ణానది జలాల యాజమాన్య బోర్డును కర్నూల్ లో ఏర్పాటు చేయాలి - పత్తికొండ ఎమ్మెల్యే కి వినతి పత్రం

కృష్ణానది జలాల యాజమాన్య బోర్డును కర్నూల్ లో ఏర్పాటు చేయాలి - పత్తికొండ ఎమ్మెల్యే కి వినతి పత్రం

కృష్ణా నది జిల్లాల యాజమాన్య బోర్డును కర్నూల్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పత్తికొండ నియోజవర్గ ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇస్తున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుదాస్, సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి రైతు సంఘం నాయకులు రంగారెడ్డి  మిగతా ప్రజా సంఘాల నాయకులతో కలసి సోమవారం రోజు ఎమ్మెల్యే ఇంటిదగ్గర  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుండి ఇ విశాఖకు తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన అర్థరహితమని రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణా నది యజమాన బొడ్డును ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది జలాల యజమాన తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. విభజన అనంతరం చాలాకాలం పెండింగుల్లో ఉన్న కృష్ణా నది యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆ కృష్ణ యాజమాన్య బోర్డు చైర్మన్ కు రాయడం వివాదాస్పదం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి తరలించి మూడు రాజధాని పేరుతో ప్రభుత్వ సచివాలయాన్ని విశాఖపట్నం కు తరలించాలని చేసిన ప్రయత్నం ప్రభాస్ పాలైంది రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడం శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హర్షిని ఏమైంది. అమరావతి రాజధాని ఏర్పాటు చేసే ఈ విషయంలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి బలపరచడం అయినది రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు ఉండాలని శాసనసభ సాక్షిగా చెప్పిన విషయం అందరికి తెలిసిన విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించక పోవడం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి పూనుకోవడం లో భాగంగానే కృష్ణా నది బోర్డు ను విశాఖకు తరలించాలని తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైనది కాదని వారన్నారు. కృష్ణా నది తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో డెల్టా రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కృష్ణా నది పరివాహక ప్రాంతం తుంగభద్ర నది నుండి డి ఇ ప్రారంభమై కృష్ణా నదిలో కలసి శ్రీశైలం ప్రాజెక్టు పైనే నేటి పంపిణీ ఆధారపడి ఉంది తుంగభద్ర సుంకేసుల కృష్ణానదిపై మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన పోతిరెడ్డిపాడు నుండి హంద్రీనీవా గాలేరు-నగరి తెలుగు గంగ ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన సిద్దేశ్వరం ఎత్తిపోతల ఎస్ ఆర్ బి సి రాయలసీమకు ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాకు తెలుగు గంగ తెలంగాణలో కృష్ణా నది పై జూరాల నెట్టెంపాడు కల్వకుర్తి ఇ ఎత్తిపోతల పథకాలు శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎస్ ఎల్ బి సి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేసే నీటి వినియోగం సక్రమంగా రాయలసీమ కోస్తా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలు ఏర్పాటు చేయడం చాలా అనుకూలంగా ఉంటుందని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్మించాల్సిన బాధ్యతలు కర్తవ్యాలు విభజన చట్టంలో స్పష్టంగా ఉన్న కృష్ణా నది జలాలను నేడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గా ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కార్యాచరణ అమలు చేయడం సమన్వయం చేయడానికి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లో కర్నూల్ లో ఏర్పాటు చేస్తే తన బాధ్యతలు సజావుగా నిర్వహించడానికి సులభంగా ఉంటుందని వారన్నారు.  

Related Posts