YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ

దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ

65.49 లక్షల రూపాయల విలువ గల 177 బ్యాటరీ మూడు చక్రాల సైకిళ్లను నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి .నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పంపిణీ చేశారు.సోమవారం నంద్యాల సమీపంలోని విజయ పాల డైరీ కి ఎదురుగా ఉన్న భారతి సీడ్స్ గోడౌన్ ఆవరణము నందు దివ్యాంగుల 177 బ్యాటరీ 3 చక్ర సైకిల్ లను. నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి. నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి .జాయింట్ కలెక్టర్  ఖాజా మొహిదీన్ (వెల్ఫైర్ )నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి. వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి విజయ లతో. కలసి పంపిణీ గావించారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు భగవంతుడు ఏదో ఒక విద్యలో నైపుణ్యత ఇచ్చి ఉంటాడని వాటిని కనుగొని వాటికనుగుణంగా జీవనం సాగించాలని అన్నారు. కర్నూలు పార్లమెంటు సభ్యులతో కలిసి  నేను ఢిల్లీలో దివ్యాంగులకు సంబంధించిన శాఖ అధికారులతో చర్చించామని  దివ్యాంగుల సంక్షేమం కొరకు నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు.  సంక్షేమ శాఖ అధికారులు అన్నారని తెలిపారు. కావున మన ప్రాంతంలోని దివ్యాంగులు ఎవరికైనా సైకిలు రాకపోయినా అర్హత కలిగిన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సోమవారం మనకు ఎంతో శుభదినం అని అన్నారు. మన నియోజకవర్గంలో ఎంతో మంది వికలాంగులు ఉన్నారని వారికి సహాయ విధంగా కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంట్ సభ్యుని నిధులతో కలిపి సోమవారం 177 సైకిల్ ను దివ్యాంగులకు అందజేస్తున్న మని అన్నారు. ఈ మూడు చక్రాల సైకిల్ బ్యాటరీ సహాయంతో నడుస్తుందని దీని విలువ 37 వేల రూపాయలు ఉంటుందని అందులో 25 వేల రూపాయలు కేంద్ర నిధులు 12 వేల రూపాయలు ఎంపీ నిధులతో కలిపి 37 వేల రూపాయల విలువైన సైకిల్ ఒక్కొక్కరికి అందజేయడం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సైకిల్ ను అతి జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలని ఆయన అన్నారు. జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిదీన్ సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ దివ్యాంగులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలన్నా చాలా కష్టపడే వారిని కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో బ్యాటరీ మూడు చక్రాల సైకిల్ ద్వారా అతి సులభంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకో గలుగుతున్నారని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు నాడు-నేడు కార్యక్రమం. అమ్మ ఒడి. జగనన్న విద్యా దీవెన .జగనన్న గోరుముద్ద .ఇలాంటి పథకాలు ఎన్నో అందుబాటులోకి తెచింది అని నిరుపేదల పిల్లలు కూడా ఉన్నత విద్య నభ్యసించుటకు కూడా చేయూతను ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 4331 మంది దివ్యాంగులకు నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల వ్యయంతో వివిధ రకాల పరికరాలను 14 దఫాలుగా అందించారన్నారు. ప్రస్తుతం సోమవారం నాడు 177 మంది దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్ ను పంపిణీ గావిస్తున్నామన్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి విజయ మాట్లాడుతూ 2019 మార్చి 2వతేదిన నంద్యాల ప్రాంతంలో నిర్వహించిన ఎంపిక శిభిరంలో ఎంపికైన 256 మందిలో 79 మందికి బ్యాటరీ ఆపరేటడ్ మూడు చక్రాల సైకిళ్ళును ఇదివరకే పంపిణి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారికి నంద్యాల పార్లమెంట్ సభ్యుల సూచన  మేరకు సోమవారం నంద్యాలలో 65 లక్షల 49 వేల రూపాయల విలువ గల బ్యాటరీ ఆపరేటివ్ మూడు చక్రాల సైకిల్ లను 177మంది దివ్యాoగులకు  పంపిణి చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన దివ్యాంగులందరు సద్వినియోగం చేసుకోవాలని వాడిని అతి జాగ్రత్తగా వాడుకోవాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో హాలీవు ప్రతినిధి జయచంద్ర వికలాంగుల సంక్షేమ శాఖ సూపరిండెంట్ విక్టర్ .అయూబ్ వారి సిబ్బంది శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts