YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

తెలుగు ప్రజల ఆరాధ్యుడు ఎన్టీ రామారావు.. - 25వ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు...

తెలుగు ప్రజల ఆరాధ్యుడు ఎన్టీ రామారావు..  - 25వ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు...

తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిర స్థాయిగా నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు 25వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్‌ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌ తదితర టీడీపీ నేతలు ఎన్టీ రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ సినీ ప్రపంచంలో రారాజుగా ఎదిగిన ప్రజల గుండెల్లో సుస్తిర స్థానం సంపాదించుకున్నారని, తదనంతరం రాజకీయాల్లో వచ్చి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చిర స్థాయిగా వారి మదిలో నిలిచిపోయారన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తెలుగువారు ''అన్నగారు'' అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గొప్ప నటుడుగా, ప్రజానాయకుడుగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారన్నారు. తెలుగు వారి ఖ్యాతిని ఢిల్లీకి వ్యాపింప చేశారని కొనియాడారు. ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారని, తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడయ్యారని అన్నారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసి, పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. అటువంటి మహానుభావుడిని నిరంతరం స్మరించుకోవాలన్నారు. రామారావు అనంతరం చంద్రబాబు నాయుడి సారధ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజల అభిమానాన్ని చూరగొందని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయస్వామి ఆలయం చైర్మన్‌ మజ్జి రాంబాబు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి,  నగర టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కోరుమెల్లి విజయశేఖర్‌, నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రాధ, కుడుపూడి సత్తిబాబు, కడియాల రాజశేఖర్‌, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, కడలి రామకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్‌, కోసూరి చండీప్రియ, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, బెజవాడ రాజ్‌కుమార్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, పాలవలస వీరభద్రం, మజ్జి పద్మ, కప్పల వెలుగు కుమారి, కొయ్యల రమణ, నాయకులు గరగ మురళి, పితాని కుటుంబరావు, కరగాని వేణు, పెనుగొండ రామకృష్ణ, రెడ్డి సతీష్‌, జమ్మి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్‌, తురకల నిర్మల, మజ్జి శ్రీనివాస్‌, నిమ్మలపూడి గోవిందు, తంగేటి సాయి, బంగారు శ్రీను, మహబూబ్‌ ఖాన్‌, చాన్‌ భాషా, జక్కా ఆదినారాయణ, కంటిపూడి రాజేంద్రప్రసాద్‌, చిన్ని యాదవ్‌, బుడ్డిగ రవి, కడితి జోగారావు, అట్టాడ రవి, పాలిక శ్యామ్‌, అహ్మదున్నీషా, గోవిందు, ఆనంద్‌, నందం చిరంజీవి, ఏసీవై కాలనీ రాజు, నల్లం ఆనంద్‌, శెట్టి జగదీష్‌, చొప్పెర్ల భద్రరావు, రేగేటి సూరిబాబు, పంచికట్ల శివ, సంసాని ప్రసాద్‌, మిస్కా రాము, మిస్కా జోగినాయుడు, తుల్లి పద్మ, నల్లం, టి శ్రీను, మారే అశోక్‌, బేనర్‌ సత్తిబాబు, వీరా రాము, నాయుడు మాస్టారు, అంగులూరి నాయుడు, కందికొండ అనంత్‌, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో 100 మందితో రక్తదానం - పండ్లు పంపిణీ :
ఎన్టీ రామారావు 25వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు హాజరై రక్తదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిధిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల పరోక్షంగా మరొకరికి ప్రాణ దానం చేసిన వారమవుతామన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.  అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని బాలింతల వార్డులోని గర్భిణీలు, బాలింతలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

Related Posts