YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

12 ఏళ్లలోపు చిన్నారులపై రేప్ చేస్తే మరణశిక్ష

12 ఏళ్లలోపు చిన్నారులపై రేప్ చేస్తే మరణశిక్ష

అభం శుభం తెలియని చిన్నారులపై కూడా మృగాళ్లు దారుణ చేష్టలకు పాల్పడుతోన్న ఘటనలు దేశంలో ప్రతిరోజూ ఏదో చోట వెలుగులోకి వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల కథువాలో చిన్నారిపై ఘోరాతి ఘోర దారుణం జరగడంతో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి

12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఆ నిందితులకు మరణశిక్ష తప్పనిసరి. మరణశిక్ష విధించేలా పోక్సో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రమంత్రి వర్గం ఇవాళ ఆమోదించింది. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం జరిపే వారికి మరణశిక్ష విధించేలా ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ ను ఆమోదం కోసం రాష్ర్టపతికి కేంద్రం పంపనుంది.12 నుంచి 16 సంవత్సరాల లోపు అమ్మాయిలపై అత్యాచారం చేస్తే 10 నుంచి 20 సంవత్సరాలకు జైలు శిక్ష పొడిగించారు. కేసు తీవ్రతను బట్టి.. జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. 0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారం జరిపే వారికి మరణ శిక్ష విధించే విధంగా రూపొందిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. త్వరితగతిన దర్యాప్తు, విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. క్రిమినల్ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నేరపూరిత ఆలోచనలు కూడా అరికట్టేలా కఠిన చట్టం తేవాలని కేంద్రం నిర్ణయించింది.

పోక్సో చట్టానికి సవరణలు తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఓ ఎనిమిది నెలల పాపపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డ కేసును విచారిస్తున్న.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు

Related Posts