YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

500 మందికే సైడ్ ఎఫెక్ట్...

500 మందికే సైడ్ ఎఫెక్ట్...

హైదరాబాద్, జనవరి 19, 
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ను కరోనా వారియర్స్ కు అందిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న వాళ్ళల్లో సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతూ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని  2,24,301 మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్టు వెల్లడించారు. వారిలో కేవలం 447 మందిలో ప్రతికూల ప్రభావం కనిపించిందని, ముగ్గుర్ని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. ఆదివారం కావడంతో కేవలం 6 రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 17,072 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని పేర్కొన్నారు.కొవ్యాగ్జిన్ టీకా తీసుకున్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సెక్యూరిటీ గార్డుకు స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. 20 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు శనివారం సాయంత్రం 4 గంటలకు టీకా వేశారని, పావుగంటలోనే అతడి చర్మంపై దద్దుర్లు వచ్చాయి. గుండె కొట్టుకునే వేగం పెరగడంతో.. వెంటనే అతడిని అబ్జర్వేషన్ లో పెట్టి చికిత్స అందించారు. తర్వాత కొద్దిసేపటికి అతడు కోలుకున్నాడని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రస్తుతం అతడిని అబ్జర్వేషన్ లోనే ఉంచామని వెల్లడించారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్లను అబ్జర్వేషన్ లో పెట్టామని, తర్వాత వాళ్ల పరిస్థితి మెరుగు పడిందని ఉన్నతాధికారులు చెప్పారు. ఒకే ఒక్కరికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నారు.భారతదేశంలో గత 24 గంటల్లో 15,144 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 17,170 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,05,57,985కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 181 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,274 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,01,96,885 మంది కోలుకున్నారు. 2,08,826 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 నిరోధక టీకా కార్యక్రమంలో 447 మందికి దుష్రభవాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన భారత్ తొలిరోజే 2 లక్షల 7 వేల మందికి పైగా టీకాలు అందించింది. ఇక రెండోరోజు ఆరు రాష్ట్రాలలో 17 వేలమందికి వ్యాక్సిన్ అందించామని ఇప్పటివరకు దేశంలో 2,24,301మంది వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని పేర్కొన్నారు.ఆరు రాష్ట్రాల్లోని 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగినట్లు మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు ఆరు రాష్ట్రాల్లో మాత్రమే  టీకా పంపిణీ కొనసాగింది. అయితే 447మందికి కలిగిన దుష్ప్రభావాలు అతి స్వల్పం మాత్రమేనని ముగ్గురికి మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సి వచ్చిందని ఆరోగ్య శాఖ తెలిపింది.

Related Posts