YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జానారెడ్డి కోసం కోమటిరెడ్డి

జానారెడ్డి కోసం కోమటిరెడ్డి

నల్గొండ, జనవరి 19, 
కాంగ్రెస్ అంటే కాంగ్రెస్సే పోండి. ఆ స్వేచ్ఛ ఆ పాలిటిక్స్.. అబ్బో.. ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వ‌రికీ అర్దం కాదు. ఉన్న‌ట్లుండి ఇప్పుడు ఐక్య‌మ‌త్య‌మే మ‌హాబ‌లం అంటున్నారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. జానారెడ్డి.. పీసీసీకి ప్ర‌స్తుతానికి అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. క‌లిసి క‌ట్టుగా న‌డుద్దామ‌ని చూస్తున్నార‌ట‌. అంతే కాదు. రేవంత్ రెడ్డి కలిసి వ‌చ్చినా లేకున్నా.. నాగార్జున సాగ‌ర్ సీటుని మాత్రం గెలిపించుకుని తీరాలి అని చూస్తున్నార‌ట‌.అవును నిజ‌మే.. 
న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి కాస్త ప‌ట్టుంది. ఈ మ‌ధ్య టీఆర్ఎస్ బ‌లం పెరిగింది. అన్ని చోట్లా ఆ పార్టీ నెట్టుకొచ్చింది. కానీ.. ఎంత‌న్నా.. సీట్లు రాకున్నా.. ఓట్లు మాత్రం బానే ఉన్న‌య్. కాంగ్రెస్ కి మాత్రం ప‌ట్టు బానే ఉంది అనొచ్చు సింపుల్ గా. ఇక జానారెడ్డి విష‌యంలో మాత్రం ఇంకాస్త బ‌లంగానే చెప్పొచ్చు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే మాట‌లా చెప్పండి. బ‌లం లేక‌నే ఓడిపోయారు క‌దా అంటే అది వేరే విష‌యం. అప్పుడంటే.. ఎవ‌రి నియోజ‌క వ‌ర్గాల్లో ఉన్నారు కాంగ్రెస్ రెడ్డి సామాజిక వ‌ర్గం లీడ‌ర్లు. కానీ.. ఇప్పుడు మాత్రం.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ లీడ‌ర్లు మొత్తం ఒక‌ట‌వుతున్నార‌ట‌. ముఖ్యంగా న‌ల్గొండ జిల్లాలో ఉన్న లీడ‌ర్లు ప‌ట్టు మీదున్నారు. ఎలాగైనా స‌రే.. జానాని గెలిపించుకుని.. మ‌న ప‌ట్టు త‌గ్గ‌లేదు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నార‌ట‌. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అంటే.. ప్ర‌జెంట్ గా పీసీసీ బాధ్య‌త‌ల్లో ఉన్నారు. సో.. ఫుల్లు స‌పోర్ట్ చేస్తారు. త‌ను కూడా ఇటు సైడే కాబ‌ట్టి.. కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇక కోమ‌టిరెడ్డి కూడా ఇదే జిల్లా కావ‌డంతో జానారెడ్డికి గ‌ట్టి స‌పోర్ట్ ఇస్తున్నార‌ట‌. ఇక పోతే.. 
న‌ల్గ‌గొండ‌లో ఇంత‌కు ముందు.. కోమ‌టి రెడ్డికి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి గ‌ట్టి పోటీ ఉండేది.. డివైడ్ అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. జానాని గెలిపించుకోవాల‌ని క‌లిసి క‌ట్టుగా న‌డ‌వాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌.ఇక జానారెడ్డి గెలిస్తే.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి మ‌రో బెన్ ఫిట్ కూడా ఉంది క‌దా. అటు సైడ్ ఉన్న సీటుని..దుబ్బాక‌లో రేవంత్ రెడ్డి గెలిపించుకోలేక పోయారు. కానీ.. జానా గెలిస్తే.. నా సైడ్ ఉన్న సీటుని నేను గెలిపించుకున్నాను అని.. కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి అనే ఛాన్స్ ఉంది. పార్టీలో త‌న‌కి ఇంకాస్త బెన్ ఫిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పీసీసీ రేస్ కి ఇది కూడా కాస్తో కూస్తో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నార‌ట కోమ‌టి రెడ్డి. పొలిటిక‌ల్ అన‌లిస్టులు కూడా ఇది క‌చ్చితంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి హెల్ప్ అయ్యే అంశ‌మే అంటున్నారు.

Related Posts