YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం

ప్రత్యేక  హోదా కోసం ప్రయత్నం

తమిళనాడులో జల్లికట్టు గురించి స్పందించిన తెలుగు సినీనటులు ప్రత్యేక హోదా విషయంపై మాత్రం నోరువిప్పట్లేరంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ చర్చించి కీలక నిర్ణయం తీసుకుని ఈ రోజు ఓ ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములవుతామని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు ప్రజలు, ప్రభుత్వం, ఉద్యమకారులకు తాము కూడా అండగా ఉంటామని తెలిపింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించింది. 

Related Posts