వరంగల్, జనవరి 20,
కరోనా కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు స్కూల్స్తెరుచుకోలేదు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 స్టూడెంట్లకు క్లాస్లు షురూ కానున్నాయి. అయితే స్కూళ్లలో ఉన్న స్వీపర్స్, స్కావెంజర్స్, అటెండర్లను సర్కారు తొలగించడం ఇప్పుడు సమస్యగా మారింది. బడి ఊడ్సేదెవరు.. బెల్లు కొట్టేదెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్కూళ్లను శానిటేషన్సిబ్బందితో క్లీన్చేయించుకోవాలని సర్కారు చెబుతున్నా పంచాయతీలో సరిపడా సిబ్బంది లేక ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని, రోజూ క్లీన్చేయించడం సాధ్యం కాదని సర్పంచ్లు తేల్చి చెబుతున్నారు.9, 10 స్టూడెంట్లకు క్లాస్లు ప్రారంభించడంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా రూల్స్అమలు చేస్తూ స్కూళ్లు నిర్వహించాలని పేర్కింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా కలెక్టర్ చైర్మన్గా తొమ్మిది మంది సభ్యులతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సూచనల మేరకు సోమవారం హెడ్ మాస్టర్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేసి డీఈవోలకు అందించారు. క్లాస్ల సంగతెలా ఉన్నా శానిటేషన్మాత్రం హెచ్ఎంలకు సవాలుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల స్కూల్స్ లో 28 వేల మంది సర్వీస్ పర్సన్స్అవసరముంది. అయితే వారి బాధ్యతలను జీపీ, మున్సిపాలిటీ కార్మికులకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా అన్ని క్లాసులు కొనసాగుతున్నపుడే గిట్టుబాటు కావడం లేదంటూ ఏజెన్సీల నిర్వాహకులు ఆందోళన చెందేవారు. ఇప్పుడు కేవలం రెండు తరగతుల స్టూడెంట్లకు వంట చేయడానికి ఏజెన్సీలు ముందుకు వస్తాయో, లేదోనని హెడ్ మాస్టర్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గతేడాదికి సంబంధించిన గౌరవ వేతనంతో పాటు బిల్లులు కూడా అందకపోవడంతో వారంతా ఆలోచనలో ఉన్నారని టీచర్స్ అంటున్నారు. 9, 10 తరగతులకు సంబంధించి భోజన ఖర్చులు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉండగా ఇప్పటివరకు ఫండ్స్రిలీజ్చేయలేదు. బియ్యం మాత్రం రేషన్షాపుల నుంచి వస్తుండగా మిగిలిన సరుకుల కోసం ముందుగా ఖర్చు చేసి తర్వాత బిల్లులు డ్రా చేసుకోవాలి. బిల్లులు పెండింగ్ ఉండటంతో భోజన కార్మికులు కూడా ముందుకు రావడం లేదు.రాష్ట్రంలో 1,271 గ్రామ పంచాయతీలు, 128 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు ఉన్నాయి. జీపీలలో 500 జనాభాకు ఒకరు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో 10 వేల జనాభాకు సుమారు 30 మంది చొప్పున కార్మికులు ఉంటారు. జీపీ కార్మికులకు 8,500, మున్సిపల్ కార్మికులకు 12,000 ఆయా జీపీ, మున్సిపాలిటీల నుంచి అందజేస్తారు. గ్రామాల్లో సరిపడా సిబ్బంది లేక ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని సర్పంచులు వాపోతున్నారు. ఇప్పుడు స్కూళ్ల బాధ్యత కూడా తమపై పెడితే ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. రోజూ స్కూళ్లను శుభ్రం చేయడం కుదరదని చెబుతున్నారు. మొత్తం బాధ్యత హెచ్ఎంలపై పెట్టడంతో వారికేం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. కొన్ని స్కూల్స్ లో సొంత డబ్బులతో గతంలో పనిచేసిన సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ఒక బెంచీకి ఒక స్టూడెంట్నే కూర్చోబెట్టాలని చెబుతున్నారు. దీంతో స్కూళ్లలో బెంచీలు కూడా సరిపోవేమోనని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.