YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

ల‌క్షద్వీప్‌లో తొలిసారి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

ల‌క్షద్వీప్‌లో తొలిసారి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

న్యూఢిల్లీ జనవరి 20 
కేంద్ర పాలిత ప్రాంతం ల‌క్షద్వీప్‌లో తొలిసారి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆదివారం వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. సోమ‌వారం నాడు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ ప‌డుతున్న ఓ వ్య‌క్తికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు తేలింది. దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మై ప్ర‌త్యేక బృందాన్ని ల‌క్ష‌ద్వీప్‌కు పంపింది. అయితే కొచ్చి నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీన ఓ ప్ర‌యాణికుడు నౌక‌లో ల‌క్ష‌ద్వీప్ వెళ్లాడు. అత‌నిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కొవిడ్ టెస్టులు నిర్వ‌హించారు. ఆ ప్ర‌యాణికుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో అత‌నితో స‌న్నిహితంగా ఉన్న‌వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 31 మందికి కొవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌గా, 14 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఈ 14 మందితో క‌లిసి తిరిగిన మ‌రో 56 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.

Related Posts