YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బండి దూకుడుకు బ్రేకులు

బండి దూకుడుకు బ్రేకులు

హైదరాబాద్, జనవరి 21, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారా? అధిష్టానానికి ఫిర్యాదు చేశారా? అందుకే సంజయ్ ను పిలిచి కేంద్ర నాయకత్వం క్లాస్ పీకిందా? అంటే అవుననే అంటున్నారు పార్టీ నేతలు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఇందులో సందేహం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ ను వెనక్కు నెట్టడం ద్వారా బండి సంజయ్ ఇమేజ్ అమాంతం పెరిగింది.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు స్వయంగా ఫోన్ చేసి బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు. దీంతో బండి సంజయ్ రేంజ్ పెరిగిందని అందరూ భావించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తెలంగాణలో హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. కానీ అదే దూకూడు బండి సంజయ్ పై కేంద్ర నాయకత్వం ఆగ్రహానికి కారణమయిందంటున్నారు.బండి సంజయ్ ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. భగవద్గీత పార్టీ కావాలా? బైబిల్ పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. అయితే ఇది ఏపీ బీజేపీ నేతలకు బాగానే ఉన్నా తెలంగాణ బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. కొందరు ముఖ్యనేతలు దీనిపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిినట్లు తెలిసింది. ప్రధాన కారణం బండి సంజయ్ వ్యాఖ్యలతో తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గం దూరమయ్యే ప్రమాదముందని వారు చెబుతున్నారు.తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, జగన్ ను అభిమానించే వారున్నారు. బండి సంజయ్ జగన్ పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం దూరమవుతుందని పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆ సామాజికవర్గం ఇప్పుడిప్పుడే బీజేపీకి దగ్గరవుతున్న సమయంలో సంజయ్ వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని వారు హైకమాండ్ కు ఫిిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిపించి మరీ క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. సంజయ్ వ్యాఖ్యలతో పార్టీకి జరిగే నష్టాన్ని ఆయన వ్యతిరేకులే అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం

Related Posts