YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలుగు రాహుల్ గాంధీగా కేటీఆర్..?

తెలుగు రాహుల్ గాంధీగా కేటీఆర్..?

హైదరాబాద్, జనవరి 21, ఏమో.. అయినా అవుతుందేమో.. ఏది ఏం మాట్లాడుకున్నా.. బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఆఫ్ట‌ర్ ట్వంటీ ట్వంటీ అనుకుంటున్నాం క‌దా. న‌మ్మ‌లేం. న‌మ్మేది కూడా లేదు. ఎప్పుడు ఎలాంటి సిచ్చువేష‌న్ ఉంటుందో.. పొలిటిక‌ల్ గా ఏం జ‌రుగుతుందో.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏం జ‌రుగుతుందో ఏమీ చెప్ప‌‌లేం. బండి సంజ‌య్ టీఆర్ఎస్ కి అంత ఫైట్ ఇస్తార‌ని అనుకున్నామా.. బీజేపీ సౌత్ లో దూసుకెళ్తుంద‌ని అనుకున్నామా. హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్ లో టీఆర్ఎస్ ప‌రిస్థితి అంత దారుణంగా ఉంటుంది అనుకున్నామా. పొలిటిక‌ల్ గా ఏం జ‌రిగినా.. అదో క‌త‌. అంతే. ఇప్పుడు కేటీఆర్ సీఎం అవుతారు అనే న్యూస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడేంటి.. ఏళ్ల‌కేళ్లుగా అదే ట్రెండింగ్ లో ఉంది. ఎన్నిక‌ల‌కి ముందే అన్నారు. ఫ‌స్ట్ ట‌ర్మ్ లోనే అనుకున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత అనుకున్నారు. గెలిస్తే కేటీఆరే సీఎం అన్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ని చేసిందీ అందుకే అనుకున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో రిజల్ట్ వ‌స్తే సీఎం అవుతారు అన్నారు. ఇప్పటికీ అదే అంటున్నారు. కానీ.. కేటీఆర్ ని సీఎం ని చేయ‌బోతున్నారు అనే విష‌యంలో ఎలాంటి డిస్క‌ష‌న్లూ న‌డ‌వ‌డం లేదు. కానీ.. టీఆర్ఎస్ లీడ‌ర్లు మాత్రం అక్క‌డో ఇక్క‌డో అంటున్నారు. అది వాళ్ల ఇంట్ర‌స్టా.. ఒక వేళ గ‌బుక్కున సీఎంని చేస్తే.. ముందే స‌పోర్టింగ్ గా మాట్లాడి కాస్త ద‌గ్గ‌ర కావాలి అని ట్రై చేస్తున్నారా అంటే.. ఎవ‌రికీ ఏమీ అర్దం కాదు. కానీ.. ఈ మ‌ధ్య టీఆర్ఎస్ లీడ‌ర్లు.. చాలా మంది ఇదే అంటున్నారు. చూస్తుంటే.. త్వ‌ర‌లోనే కేటీఆర్ ని సీఎం గా చూడ‌బోతున్నాం అనే విష‌యంలో కొన్ని కొన్ని క్లారిటీస్ వస్తున్నాయి.
కానీ.. హ‌నుమంతుడి పెళ్లి ఎప్పుడు అంటే.. రేప్పొద్దున ఉద‌యం ఎనిమిదిన్న‌ర‌కి అన్న‌ట్లే ఉంటుందేమో అనే డౌట్ కూడా ఉంది. కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్ గాంధీ ఎవ్వారంలో కూడా అప్ప‌ట్లో ఇలాగే జ‌రిగింది. రాహుల్ ప్రధాని అవ‌బోతున్నారు.. అవ‌బోతున్నారు.. అవుతున్నారు.. రేపే అవుతున్నారు అనుకున్నారు. ఆయ‌నేమో.. ప్ర‌ధాని అయ్యేదాకా పెళ్లీ పెటాకుల్లేకుండా ఉంటా అని తిరుగుతున్నారు. ఆయ‌న ప్రధాని ఎప్పుడు అవుతారో.. ఆ బ్ర‌హ్మ‌దేవుడికి కూడా తెలుసో లేదో. ఇక తెలంగాణ‌లో కూడా మినిస్ట‌ర్ కేటీఆర్ ది.. రాహుల్ గాంధీ లాంటి ఎవ్వార‌మే ఉన్న‌ట్లుంది అనే వాళ్లూ ఉన్నారు. ఎప్ప‌ట్నుంచో అంటున్నా.. ఓ కొస‌కీ మొదుల‌కీ రాని ఎవ్వారం అది.. అయిన‌ప్పుడు చూద్దాంలే అని చాలామందే అంటున్నారు. జ‌నంలో కూడా ఇంట్ర‌స్ట్ పోయిన‌ట్లుంది.

Related Posts