విజయవాడ, జనవరి 21, ఒకప్పుడు వేరు.. నీతులు చెప్పాలంటే రాజకీయ నేతల తర్వాతనే ఎవ్వరైనా. పాటించినా పాటించకపోయినా వంద నీతులు చెబుతారు. జనాల్ని మంచి మార్గంలో నడవడానికి ట్రై చేస్తారు. అఫ్ కోర్స్.. అప్పుడు కూడావాళ్లపై నెగటివ్ కామెంట్స్ ఉన్నా.. బయటికి మాత్రం హుందాగా నడుచుకుంటారు. ప్రజల ముందు దేవుడిగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారింది. ట్రెండ్ సెట్టింగ్ పనిలో ఉన్నారు. 2020 ఎఫెక్ట్ ఇంకాస్త గట్టిగా పడినట్లుంది. బూతుల్ని కూడా నీతుల్లా చెబుతున్నారు పొలిటికల్ లీడర్లు. మాటల్లో ఘాటు పెంచి.. మసాలా మాంచిగ దట్టించి.. బీ గ్రేడ్ సినిమా డైలాగుల్ని మించి పోయేలా చేస్తున్నారు. ఇక వైసీపీ లీడర్లు ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంటారని తెలిసిందే కదా. వారిలో కొడాలి నాని ఇంకాస్త స్పీడు. ఎక్కడా తగ్గరు. ఆల్రెడీ బూతుల మినిస్టర్ అని పేరొచ్చింది. తను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి.. పబ్లిక్ మీటింగ్ పెట్టినా.. అక్కడ వందల మంది ఉన్నా.. వేల మంది జనం ఉన్నా సరే.. ఆలోచించే ప్రసక్తే లేదు. మైక్ అందుకున్నారు అంటే దంచుడే. ఇక టీడీపీ లీడర్ల విషయంలో ఓ మెట్టు పైకెక్కి మరీ బూతులు మాట్లాడతారు. ఆల్రెడీ ఆయనకి రాజకీయ పాఠాలు నేర్పిందే టీడీపీ. ఇక్కడు ఉన్నన్నాళ్లూ క్రమ శిక్షణగానే కనిపించిన కొడాలి నాని. తర్వాత వైసీపీలోకి వెళ్లారు. కాస్త మినిస్ట్రీ కూడా ఇవ్వడంతో ఇంక ఆగడం లేదు. ఏ సర్టిఫికెట్ ఇచ్చే సినిమాల్లో కూడా బీప్ వేసే డైలాగులు కొడతారు. డైలాగులు కావు అవి.. బూతులు అనే విషయం జనం అందరికీ తెలుసు. ఆయన మాట్లాడే మాటలకి టీవీ వాళ్లు బీప్ లు వేయరు.. నేరుగా జనంలోకి వెళ్తాయి అని కూడా తెలుసు.తనకి తాను మినిస్టర్ అనే విషయాన్ని మర్చిపోతారో ఏమో కానీ.. ప్రజా ప్రతినిధి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటారు. ఒక విషయంపై వాదించడం వేరు.. కౌంటర్ చేయడం వేరు.. కామెంట్ చేయడం వేరు.. సపోర్ట్ చేయడం వేరు. ఇలా చాలా రకాలు భావాలు ఉంటయ్. వాటికి తగ్గట్లు మాట్లాడుకోవడానికి ఎన్నో రకాలు మాటలు ఉంటయ్. కానీ.. కొడాలి నానికి మాత్రం బూతులే ఎక్కువగా వస్తుంటయ్. ఎక్కువగా కాదు.. పది మాటలు మాట్లాడితే అందులో నాలుగు బూతులే ఉంటయ్ అనడంలో ఎలాంటి డౌటూ అక్కర్లేదు. మరి మినిస్టర్ గారు ఇలాగే బూతులు మాట్లాడుతూ.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామనుకుంటున్నారో ఏమో. ఆయనకే తెలియాలి.