YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా టీటీడీ బోర్డు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా టీటీడీ బోర్డు
ఏపీ ప్రభుత్వం నియమించిన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌‌పై పెద్ద ఎత్తున అభ్యంతరాల వివాదం ముగియక మునుపే మరో వివాదం చెలరేగింది. సీఎం చంద్రబాబు తాజాగా.. టీటీడీ మెంబర్లను ప్రకటించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వ్యవహారంలో పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.స్వయంగా తాను క్రైస్తవ మతస్థురాలినని చెప్పుకున్నా, ప్రపంచంలోనే అతి పెద్ద హైంధవ ధార్మిక సంస్థలో ఆమెను సభ్యురాలిగా ఎలా నియమిస్తారన్నదే నేడు హైందవలోకం కనె్నర్ర చేయడానికి కారణమైంది. ఆమె బయోడేటాను చూసుకోకుండా ముఖ్యమంత్రి ఆమె పేరును టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో ఎలా చేరుస్తారని బీజేపీ, వీహెచ్‌పితోపాటుగా రాయలసీమ పోరాట సమితీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఆమె పేరును టీటీడీ పాలక మండలి జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయిఒకప్పుడు తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిఈ వివాదంపై ఎమ్మెల్యే అనిత స్పందిస్తూ.. "నేను బేసిగ్‌‌గా క్రిస్టియన్‌.. కానీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిని. ఏ శుభకార్యమైనా హిందు సాంప్రదాయం ప్రకారమే చేసుకుంటాం. దళిత మహిళ అని చూడకుండా రాద్దాంతం చేస్తున్నారు. చంద్రబాబు నన్ను ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. టీటీడీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందుకు నా పూర్వ జన్మ సుకృతం అయిందన్నప్పటికి విమర్శలు తారస్థాయికి చేరడంతో .దీంతో ఆమెకు పదవికి టాటా చెప్పేశారు.ఇదిలా ఉంటే.. పాలక మండలి సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బ్రాహ్మణులను తొక్కి ఉమాకు పదవి ఇవ్వడం సరికాదన్నారు. ఉమా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం మా బ్రాహ్మణ సంఘాలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆయన గెలుపు కోసం సాయశక్తులా కృషి చేస్తే గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. గెలుపొందిన నాటి నుంచి ఇప్పటి వరకూ బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. మొదట చైర్మన్‌తో మొదలుకున్న ఈ వివాదం ఇప్పటికి ఫుల్‌స్టాప్ లేకుండా నడుస్తూనే ఉంది.! అయితే ఈ వ్యవహారాలన్నింటిపై సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Related Posts