ఆధునిక స్వాతంత్ర్య భావాలు గల విలక్షణమైన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని నడిపించడానికి అద్భుతమైన ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలను ఒక చోట చేర్చింది నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ ఈరోజు తన మొదటి ఒరిజనల్ తెలుగు ఫిలిం 'పిట్టకథలు' ప్రకటించింది. ఈ నాలుగు భాగాల ఆంథాలజీ చిత్రానికి నలుగురు తెలుగు సినిమా అత్యుత్తమ దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలు దర్శకత్వం వహించారు. సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను పిట్టకథలు అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల నలుగురు మహిళల గురించి చెబుతుంది. ఈ నాలుగు పాత్రలకు ప్రాణం పోయడానికి ఈషా రెబ్బా, లక్ష్మి మంచు, అమలా పాల్, మరియు శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మా ఫిల్మ్ స్లేట్‌ను విస్తరించాలనుకుంటున్నాము. ఈ క్రమంలో భిన్నమైన శైలి కలిగిన తెలుగు స్టోరీ టెల్లింగ్ ను 'పిట్టకథలు' ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సభ్యుల కోసం ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం`` అన్నారు.