రాష్ట్రంలో చంద్రబాబు మోసాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 69వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రెడ్డిగుంట బాడవ శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర సురమాల గ్రామం మీదుగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ నుంచి మొదలై ముందుకు సాగుతుంది. పెనబాక, పీటీ కండ్రిగ, అర్లపాడు క్రాస్, చెంబేడు, నందిమాల క్రాస్, సీఎన్‌పేట, ఉమ్మాలపేట వరకూ పాదయత్ర కొనసాగుతుంది.
జననేతకు ఘనస్వాగతం...చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకొని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైయస్ జగన్‌కు జిల్లా వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జననేతను కలుసుకునేందుకు జిల్లా వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా 9 నియోజకవర్గాల్లో సుమారు 20 రోజుల పాటు, 230 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జిల్లాలోని ప్రజల సమస్యలను తెలుసుకొని అధికార పార్టీ తీరును వైయస్ జగన్ ఎండగట్టనున్నారు