YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

జన్ ధన్ తో భారత్ కు ప్రపంచ గుర్తింపు...!!

జన్ ధన్ తో భారత్ కు ప్రపంచ గుర్తింపు...!!
భారత ఆర్థిక సంస్థలు ప్రపంచ బ్యాంకు నుంచి మరో అరుదైన గుర్తింపును దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించే బ్యాంకు ఖాతాల్లో 55శాతం భారత్‌వేనని వరల్డ్ బ్యాంకు డేటా వెల్లడించిందని, ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన విజయవంతమైందని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఫిండెక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 2014-17 మధ్యకాలంలో 51.4కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవగా, అందులో 55శాతం ఖాతాలు భారత్ నుంచి ప్రారంభించినవి. ఇక గతేడాది ప్రారంభంలో 28.17 కోట్లుగా ఉన్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మార్చి 2018 నాటికి 31.44కోట్లకు చేరాయని పేర్కొంది. 2011లో బ్యాంకు ఖాతాలు ఉన్న యువత 35శాతంగా కాగా, 2014కు 53శాతం, 2017 నాటికి 80శాతానికి చేరారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 2018 ఏప్రిల్ 11నాటికి రూ.80,545.70 కోట్లు ఈ ఖాతాల్లో నిల్వ ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఖాతాల గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. ఈ ఖాతాల్లో జమలు 2017 మార్చి నుంచి క్రమంగా పెరుగుతున్నాయి.

Related Posts