వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఇల్లు వదిలి బయట కు రాలేని పరిస్థితి ఉంటుంది. ఇంటి పట్టున ఉందామంటే ఉక్కపోతతో అవస్థలు పడాల్సి వస్తుంది. ఏప్రిల్ నెలలో 37- 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాలి. ఒకటి రెండు డిగ్రీలు పెరిగితే ఏమో అనుకు ంటాం. కానీ రోజురోజూకీ ఎండలు పెరుగుతూ 45 డిగ్రీలకు చేరుకుంది. మరోవారం పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అప్రమ త్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారుల సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తు తున్నారు. మానవ తప్పిదాల వల్ల వాతవరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ కారణాల వల్ల మహానగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారాయి.రోజురోజుకి ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. గతంలో వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువుగా ఉండేవి. చెట్లు అధికంగా ఉండడంతోపాటు, కాలుష్యం కూడా తక్కువుగా ఉండడంతో వాతావారణం చల్లగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోను అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో వేసవి వచ్చిం దంటే.. గ్రామీణ ప్రాంత ప్రజలు చెట్ల కిందకే చేరేవారు. చెట్లకిందే అన్ని పనులు చేసుకునే వారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోను చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. గ్రామీణ ప్రజలు కూడా ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్యం పెరుగుతోంది. వెరసి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయి.భానుడి ప్రతాపానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 2, 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్ర తలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో.. తొలిసారి గరిష్ట రికార్డులను చేరుకోను న్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు
రోజు రోజుకు పెరుగుతున్న టెంపరేచర్ ....!!