పిఠాపురం జనవరి 22,
విగ్రహాలధ్వంసం దుశ్చర్యల నేపథ్యంలో ఆలయాలను,వాటి ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వంతోపాటు ఆయా ఆలయాల కమిటీలు,భక్తులుకూడా బాధ్యతలు తీసుకోవాలని,ఇందుకు ప్రభుత్వ సూచనలమేరకు తప్పనిసరిగా ఆలయాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పిఠాపురం పట్టణ ఎస్సై శంకరరావు కోరారు.పిఠాపురం పట్టణం జగ్గయ్యచెరువు కాలనీవద్ద సామర్లకోట రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయానికి పిఠాపురం అర్బన్ బ్యాంకు ఛైర్మన్ బాలిపల్లి రాంబాబు సమకూర్చిన సీసీ కమెరాల ఏర్పాటును ఎస్సై శంకరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై శంకరరావు,ఆలయ నిర్మాణ దాత నాళం నారాయణరావు,అర్బన్ బ్యాంకు ఛైర్మన్ బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఓరుగంటి వీరబాబు,అడబాల గోపాలకృష్ణ,విశ్వనాధుల రమఢ,జీ.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.