విశాఖపట్నం జనవరి 22,
డుంబ్రిగుడ బాలికల పాఠశాలలో బంగారం చోరీకి పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గోపాల్ రావు తెలిపారు.ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.బాలికల ఆశ్రమ పాఠశాల మెట్రిన్ శాంతి తన బ్యాగ్ లోని రెండు తులాల బ్రాస్ లెట్,మూడు తులాల నెక్లెస్,చోరీకి గురైందని ఈనెల 17న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పరిశీలించారు.దీని ఆధారంగానే ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్ ఆలీ అనే వ్యక్తి ఈ చోరీ చేసినట్లు గుర్తించారు.నిందితుడు పాఠశాలలో టైల్స్ వేసే పనికి వచ్చే వాడు.అదే రోజు మెట్రిన్ బ్యాగులు బంగారాన్ని పెట్టడాన్ని గమనించి మాయం చేశాడు.నిందితుడు ఉపయోగించిన బైక్,చోరీ సొత్తు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.మూడు రోజులుగా కేసును చేదించిన ఎస్ ఐ సిబ్బందిని పాడేరు డిఎస్పి రాజ్ కమల్ సీఐ పైడయ అభినందించారు.