కొత్తగూడెం లో సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎస్ కె రబ్బాని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనిశెట్టి పల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రజిత అనే మహిళ తన భర్త మృతి చెందిన కారణంగా ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడం కోసం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి రాగా జూనియర్ అసిస్టెంట్ సహాయ రబ్బానీ ఆమెను 1లక్షా10 వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ముందస్తుగా 30000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వడానికి ఇష్టంలేని కొత్తపల్లి రజిత ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఖమ్మం నుండి విచ్చేసిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న రబ్బానీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.ఈ విషయం పై బాధిత మహిళ కొత్తపల్లి రజిత మాట్లాడుతూ తన భర్త వెంకటేశ్వర్లు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడని,ఇటీవల మరణించాడని తెలిపింది.ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడం కోసం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ 1లక్షా 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని వాపోయింది. ముందస్తు లంచం గా 30వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు తెలియజేసినట్లు వివరించింది.