వార్తలు రాజకీయం దేశీయం
నరేంద్ర మోడీకి సొంత పార్టీ నుంచి తొలిసారి భారీ సవాల్ ఎదురైంది. వాజపేయి క్యాబినెట్ లో ఆర్దికమంత్రిగా పనిచేసి బీజేపీలో సొంత ఇమేజ్ వున్న యశ్వంత్ సిన్హా ఇప్పుడు కమలానికి రామ్ రామ్ చెప్పి ఏమి చేయబోతున్నారు అనేది దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. సొంత పార్టీలో లుకలుకలు ఎంపీల బుజ్జగింపులతో మోడీ చరిష్మా మసకబారేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. యశ్వంత్ పార్టీ నుంచి రాజీనామా చేయడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. పార్లమెంట్లో అవిశ్వాసం చర్చకు వస్తే సొంత పార్టీ నుంచి మోడీపై వున్న అసంతృప్తి దేశ వాసులముందు తెలిపే ఛాన్స్ లేకుండా చేశారన్నది ఆయన ఆగ్రహానికి కారణమని కొందరు అంటున్నారు80 ఏళ్ళ యశ్వంత్ సిన్హా విపక్షాలతో చిత్రంగా చేతులు కలిపారు. ఆయన పార్టీకి రాజీనామా ప్రకటన చేసే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు పక్కన ఉండటం కొత్త చర్చకు దారితీస్తుంది. మోడీ సర్కార్ దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని యశ్వంత్ ఘాటుగా విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలు పార్లమెంట్ సమావేశాలు జరక్కుండా అడ్డు పడింది మోడీ నేనని యశ్వంత్ ఆరోపిస్తున్నారు. ఒక పక్క దేశ ఆర్ధిక వ్యవస్థను గాడితప్పించి, మరోపక్క ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే ఈ సర్కార్ కొనసాగడం మంచిది కాదని యశ్వంత్ వాదిస్తున్నారు. ఆయన వాదనకు బాలీవుడ్ షాట్ గన్ శత్రుఘ్న సిన్హా కూడా జత కలిశారు. మోడీకి వ్యతిరేకంగా సొంత పార్టీలో గళం వినిపించే వారి సంఖ్య ఇప్పటికే 8 మంది వరకు ఉన్నట్లు యశ్వంత్ వర్గీయులు చెబుతున్న లెక్క . ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.మోడీ సర్కార్ కొలువు తీరాక నోట్ల రద్దు నిర్ణయంపై తొలిసారిగా సొంత పార్టీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది యశ్వంత్. ఆ తరువాత ఒక్కరొక్కరుగా స్పందించినా సిన్హా ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. యశ్వంత్ కుమారుడు జశ్వంత్ జయంత్ సిన్హా మోడీ క్యాబినెట్ లో ఉండగా ఆయన ఇలా దూకుడుగా ఎదురు తిరుగుతారని ఎవ్వరు ఊహించలేదు. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసినా అవన్నీ తాత్కాలికమే అని అంతా అనుకున్నారు.యశ్వంత్ రాజీనామా తో తాజాగా ఎదురవుతున్న సవాళ్ళను మోడీ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి
మోడీకి యశ్వంత్ సిన్హా రూపంలో తలనొప్పి....!!