YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉల్లి దళారులకే భోజ్యం.....!!

ఉల్లి దళారులకే భోజ్యం.....!!
మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ఉల్లి వ్యాపారుల, దలారుల మాయాజాలమేనని స్పష్టం అవుతుంది.మార్కెట్‌లలో వ్యాపారుల, దళారుల మాయ జాలం వల్ల ఉల్లిగడ్డ ధరలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు రైతులు హోల్‌సేల్ మార్కెట్‌లో అమ్మడానికి వెళ్ళిన ఉల్లిగడ్డలను దళారీలు ఏకమై రైతుల నోళ్లను కొట్టి రైతుల సరుకులను తక్కువ ధరలకే కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారు. స్థానిక మార్కెట్‌లో ప్రజలకు కూడా నెత్తిన శఠగోపం పెడుతున్నారు. . ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, ఆస్పరి, కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, గోనెగండ్ల, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి మండలాల్లోని ప్రతి గ్రామంలో కూడ బోరుబావుల కింద ఉల్లిపంటను రైతులు 20వేల ఎకరాల్లో పండిస్తారు. ఆదోని డివిజన్‌లో పండిన ఉల్లిగడ్డ విజయవాడ, తాడేపల్లె గూడెం, చెన్నై, హైద్రాబాదు, బెంగుళూరు, కర్నూలు మార్కెట్లకు అమ్మకానికి రైతులు తీసుకెళుతున్నారు. స్థానికంగా ఆదోనిలో ఉల్లిగడ్డల మార్కెట్ సౌకర్యం లేకపోవడం వలన ఇతర ప్రాంతాలకు రైతులు ఉల్లిగడ్డలను అమ్మకానికి తీసుకెళ్లడం జరిగింది. తాడేపల్లె గూడెం, విజయవాడ మార్కెట్లకు అమ్మకానికి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ హోల్‌సెల్ మార్కెట్‌లలో రైతులు తీసుకుని వెళ్ళిన ఉల్లిగడ్డలకు క్వింటాళ్లు రూ.100ల నుంచి రూ.120వరకు మాత్రమే వ్యాపారులు,దళారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ఎక్కడో వున్న ఒకటి, రెండు ఉల్లిగడ్డల లాట్లకు రూ. 500 కొనుగోలు చేసి ఎక్కువ ధర రూ. 500 అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం వ్యాపారులు మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న రేటు ప్రకారం ప్రజలకు రూ. 1కి లేదా రూ. 2 కిలో ప్రకారం అమ్మాలి కాని మార్కెట్‌లలో ప్రజలకు కేజీ ఉల్లిగడ్డలు రూ. 20నుంచి రూ. 30కు అమ్ముతున్నారు. దాదాపుప్రజలకు రూ. 15ల చొప్పున అధిక ధరలకు ఉల్లిగడ్డలను అమ్మతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను హోల్‌సెల్ మార్కెట్‌లలో రంగంలోకి దింపి రైతుల వద్ద కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకు అందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వ్యాపారుల, దళారుల దగాకు కళ్లేం పడుతుంది. ఉల్లి ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇప్పటికే ఉల్లిగడ్డల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు.

Related Posts