వార్తలు ఆంధ్ర ప్రదేశ్
ఎన్నికల సంవత్సరం కావడంతో పదవుల పందేరంపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. అసంతృప్తితో ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకాలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ సహా పాలకమండలిని, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. దీనికి కొనసాగింపుగా ఐదు కార్పొరేషన్లకు సభ్యులను తాజాగా నియమించింది. ఏపీ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యులుగా ఎల్‌ఎల్ నాయుడు (శ్రీకాకుళం), పాకాటి బాలాజీ నాయుడు (చిత్తూరు), గాదిరాజు సత్యనారాయణరాజు (పశ్చిమ గోదావరి), పీఎం వరప్రసాద రెడ్డి (కడప), మాడంశెట్టి నీలబాబు (విశాఖ)లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సభ్యులుగా ఎన్ ఈశ్వరరావు (శ్రీకాకుళం), మారకాని పరబ్రహ్మం (కృష్ణా), రుత్తల వెంకటరమణ (విశాఖ), కామిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యం (కడప), ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యులుగా మోదవలస రమేష్ (శ్రీకాకుళం), శీలం వెంకటేశ్వరరావు (పశ్చిమ గోదావరి), మాలేపతి రవీంద్ర నాయుడు (నెల్లూరు), చెమికాల పురుషోత్తం రెడ్డి (కడప), దేవినేని పురుషోత్తం నాయుడు (అనంతపురం) నియమితులయ్యారు. ఏపీ గ్రంథాలయ సంస్థ సభ్యులుగా డాక్టర్ రావి శారద (కృష్ణా), గొట్టపు వెంకటనాయుడు (విజయనగరం), సూర సుధాకరరెడ్డి (చిత్తూరు), నల్లంపల్లి వీర్రెడ్డి (తూర్పు గోదావరి), ఏపీ షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ సభ్యులుగా బొమ్మి సురేంద్ర (నెల్లూరు), కురుబ బుల్లి శివబాల (అనంతపురం), అంగదల పూర్ణచంద్రరావు (కృష్ణా), కె వీర మునేశ్వరరావు (పశ్చిమ గోదావరి), టి అనంతమ్మ (ప్రకాశం), గంకాల అప్పారావు (విశాఖ)లను ప్రభుత్వం నియమించింది.
నామినేషన్ల పదవులకు తెర లేపారు...!!!