YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్...యూ టర్న్...

కేసీఆర్...యూ టర్న్...

హైదరాబాద్, జనవరి 23, 
మ‌నం ప‌ది మెట్లు ఎక్కితే మ‌న పిల్ల‌లు ప‌ద‌కొండో మెట్టు నుంచి స్టార్ట్ చేయాలి అంటారు క‌దా. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కూడా డైలాగ్ బాగా స్యూట్ అయ్యేలా ఉంది. తెలంగాణ సీఎం మార‌బోతున్నారు అన్న న్యూస్ వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి.. మినిస్ట‌ర్లు అంతా కేటీఆర్ పాట పాడుతున్న టైం నుంచీ.. ఏవేవో వార్తలు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌తి ప‌క్షాల‌కు ఏం మాట్లాడాలో తెలీని ప‌రిస్థితి క్రియేట్ అయింది. వాటిన‌లా వ‌దిలేస్తే.. త్వ‌ర‌లోనే కేటీఆర్ సీఎం కాబోతున్నారు. ఇందులో ఎవ‌రికీ డౌట్ లేదు. కానీ.. కేటీఆర్ ఎక్క‌డ స్టార్ట్ చేస్తారు. ఎక్క‌డ రెయిజ్ చేస్తారు. ప్ర‌తి ప‌క్షాల‌తో ఎలా ఉంటారు.. స్వ ప‌క్షాల‌తో ఎలా ఉంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.కేసీఆర్ బీజేపీ విష‌యంలో ప‌ది మెట్లు ఎక్కారు అనుకుందాం. కానీ.. లాస్ట్ లో మాత్రం రివ‌ర్స్ అయ్యారు. పూర్తిగా కిందికి వ‌చ్చిన‌ట్లున్నారు. బీజేపీని బొంద‌పెడ‌తాం అనే డైలాగ్ ద‌గ్గ‌ర్నుంచి.. బీజేపీ కీర్త‌న‌ల్ని ఇండైరెక్ట్ గా వినిపించేదాకా వెళ్లింది టీఆర్ఎస్. స‌డ‌న్ గా ట్విస్ట్ ఇస్తున్నారు. నిన్న మొన్న కూడా ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మెట్టు దిగారు. ఆర్థికంగా వెన‌క‌బ‌డిన వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అంటున్నారు. అది రెండేళ్ల కింద‌ట్నే మొద‌లు కావాల్సిన పథ‌కం. కానీ.. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తొక్కిప‌ట్టింది. దాని పేరు కూడా వినిపించ‌లేదు.ఇప్పుడేమో.. ఆ ప‌థ‌కానికి జై కొట్టింది. మొన్నా మ‌ధ్య కూడా ఆయుష్మాన్ భార‌త్, రైతు చ‌ట్టాల ఎవ్వారం తెలిసిందే క‌దా. మరి కేసీఆర్ అంటే.. స‌డ‌న్ గా ఇంత‌లా మారిపోయారు. ఇప్పుడు బీజేపీ విష‌యంలో కేసీఆర్ ఏ మెట్టు మీదున్నారు. కేంద్రంలో జెండా ఎగ‌రేస్తాం అనే టీఆర్ఎస్ ని.. కేటీఆర్ ఎటు తీసుకెళ్ల‌బోతున్నారు. ఫైటింగా.. వెయిటింగా. లేదంటే.. యూ ట‌ర్నింగా.. ఏమో.. ప‌ది మెట్లు ఎక్కిన కేసీఆర్ ద‌గ్గ‌ర్నుంచి.. ప‌ద‌కొండో మెట్టు అంటూ పైకి ఎక్కుతారా.. తొమ్మిది ఎనిమిది అనుకుంటూ.. కిందికి దిగుతారా అన్న‌ది క్వ‌శ్చ‌నే.ఇక సొంత పార్టీలో కూడా ఎన్నో పాలిటిక్స్. హ‌రీశ్ రావుని ప‌క్క‌నే తిప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు క‌దా. ఆయ‌నకి పార్టీలో ఇంపార్టెన్సే లేదు అనే టాక్ ఉంది. హరీశ్ రావుకి మాస్ లో ఫాలోయింగ్ ఉండ‌డం.. తొక్కేశారు అనే టాక్ వ‌చ్చింది కాబ‌ట్టే.. మంత్రి ప‌ద‌వి ఇచ్చారు అనే టాక్ కూడా ఉంది. మ‌రి కేటీఆర్ సీఎం అయితే.. ప‌క్క‌లో బ‌ళ్లెం ఎందుకులే అని.. సైడ్ చేస్తారా.. బావా రావా అంటూ.. స‌పోర్ట్ తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లి ఇంకా స్ట్రాంగ్ చేసే ప‌నిలో ప‌డ‌తారా. అస‌లు వీళ్లిద్ద‌రికీ పొసుగుతుందా. ఈ విష‌యంలో కూడా ఏం జ‌రుగుతుందో ఏమో. ఇక పోతే.. పార్టీలో ఏ లీడ‌ర్ నీ హైలైట్ కాకుండా చూడ్డంలో కేసీఆర్ స్పెష‌ల్ అనే చెప్పాలి. అంతా.. గుప్పిట్లో పెట్టుకుని న‌డిపిస్తారు. ఆ విష‌య‌లో కేటీఆర్ మెట్టు ఎక్కుతారా.. దిగుతారా.. పొలిటిక‌ల్ గా ఎలాంటి స్ట్రాట‌జీస్ తీసుకుంటారు అనేది పాయింటే.

Related Posts