YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

10 లక్షలు దాటిన వ్యాక్సిన్లు...

10 లక్షలు దాటిన వ్యాక్సిన్లు...

న్యూఢిల్లీ, జనవరి 23 
దేశంలో కరోనా టీకా పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. కేవలం ఆరు రోజుల్లోనే 12 లక్షల మందికిపైగా తొలి డోస్ అందజేశారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత వేగంగా ఆరు రోజుల్లోనే 10 లక్షల మందికిపైగా టీకాలు వేయలేదు. ఈ రికార్డును భారత్ సాధించింది. గురువారం రాత్రి వరకు 10.4 లక్షల మందికి టీకా వేసినట్టు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. శుక్రవారం సాయంత్రానికి 1.3 మిలియన్లు (12.7 లక్షల) మంది తొలి డోస్ తీసుకున్నట్టు తెలిపింది.అమెరికాలో డిసెంబరు 14న వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాత 10 మిలియన్లు మందికి టీకా వేయడానికి 10 రోజులు పట్టింది. ఇక, బ్రిటన్‌లో డిసెంబరు 8న ప్రారంభించగా.. తొలివారంలో కేవలం 130,000 మందికి టీకా ఇచ్చారు. డిసెంబరు 26 నాటికి 10 లక్షల మందికి టీకా వేశారు. ఇదిలా ఉండగా జనవరి 20 నాటికి చైనాలో 15 మిలియన్ల మందికి టీకా ఇచ్చినట్టు ప్రకటించినా, దీనిపై వివరాలను మాత్రం అందుబాటులో లేవు. అయితే, నవంబరు నాటికే చైనాలో 10 లక్షల మందికి టీకా అందజేసినట్టు నేచుర్ జర్నల్ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 57 మిలియన్ల టీకా డోస్‌లను అందజేశారు. ఇందులో అమెరికా 17.5 మిలియన్లతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత చైనా (15 మిలియన్లు), బ్రిటన్ (5.4 మిలియన్లు), ఇజ్రాయెల్ (3.3 మిలియన్లు), యూఏఈ (2.3 మిలియన్లు), జర్మనీ (1.4 మిలియన్లు), ఇటలీ (1.3 మిలియన్లు), టర్కీ (1.1 మిలియన్లు), స్పెయిన్ (1.1 మిలియన్లు) ఉన్నాయి. వీటి తర్వాత 10 స్థానంలో భారత్ ఉంది.అయితే, మిగతా దేశాల కంటే భారత్ టీకా పంపిణీ ఆలస్యంగా ప్రారంభించింది. చైనా తప్ప మిగతా దేశాల కంటే భారత్‌లో టీకా పంపిణీ సుదీర్ఘకాలం కొనసాగనుంది. ఎందుకంటే అధిక జనాభాయే దీనికి కారణం. పది మిలియన్ డోస్‌లను అందజేయగా.. దేశంలోని ప్రతి 100 మందికి 0.08 శాతం మాత్రమే టీకా అందింది. ఈ విషయంలో ఇజ్రాయేల్ అన్ని దేశాల కంటే ముందుంది. ప్రతి 100 మందిలో 38 మందికి టీకా అందజేశారు. యూఏఈలో ప్రతి 100 మందికి 22.7, బహ్రెయిన్ 8.5, బ్రిటన్ 8, అమెరికా 5.3 మందికి వేశారు.

Related Posts