YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ వైపు చూస్తున్న బీజేపీ నేతలు...!!

వైసీపీ వైపు చూస్తున్న బీజేపీ నేతలు...!!
మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య బంధం తెగిపోయిన తరువాత ఈ రెండు పార్టీల్లోని అంతర్గత పరిస్థితుల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీతో చాలా కాలంగా వైరాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీలోకి వీరు ఎలాగూ వెళ్లే పరిస్థితి లేదు. ఇక వైసీపీ, జనసేన పార్టీలు మిగిలాయి. జనసేన ఇంకా సంస్థాగతంగా బలపడలేదు. దీంతో బీజేపీ వలస నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోందిరాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని ఏ అంశాన్నీ మోదీ అమలు చేయలేదంటూ ఆ పార్టీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నారు. ఆ తరువాత రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని నిలబెట్టారు. దీంతో బీజేపీ నేతల పరిస్థితి అయోమయంగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు బీజేపీలోకి వచ్చారు. వీరిలో పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు వారి ముఖ్య అనుచరులు ఉన్నారు. ఇప్పుడు వీరంతా పునరాలోచనలో పడ్డారు. వీరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం లేదు.. ఇదిలావుండగా బీజేపీ కూడా మరోపక్క నుంచి దూకుడు పెంచుతోంది. రాష్ట్ర పార్టీకి కొత్త రథసారథిని నియమించే ప్రక్రియం మరికొద్ది రోజులో పూర్తికానుంది. మరోపక్క ఏపీకి మోదీ ప్రభుత్వం చేసిన ఉపకారాన్ని పార్టీ నేతలకు విశదీకరిస్తున్నారు. జిల్లా అధ్యక్షులను పటిష్ఠం చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వారి నాయకత్వంలో బీజేపీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించింది. రాష్ట్రంలో మిగిలిన పార్టీల విషయాన్ని పక్కన పెట్టి, తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్‌గా చేసుకుని ముందుకెళ్లాలని అధిష్ఠానం శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.

Related Posts