YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భారత్‌ ‘నిజమైన స్నేహితుడు’ : అమెరికా

భారత్‌ ‘నిజమైన స్నేహితుడు’ : అమెరికా

న్యూఢిల్లీ జనవరి 23 
జో బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్‌ను ప్రశంసించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేస్తున్న భారత్‌ను ‘నిజమైన స్నేహితుడు’గా పిలిచింది. దక్షిణాసియా దేశాలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తూ.. ప్రపంచ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో భారత్‌ పాత్రను అభినందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఉచిత వ్యాక్సిన్‌ను మాల్దీవులు, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌కు సరఫరా చేసిందని, మరిన్ని దేశాలకు విస్తరిస్తుందన్నారు. ‘భారతదేశం తన ఫార్మాను ఉపయోగించి గ్లోబల్ కమ్యూనిటీకి సహాయం చేస్తోంది’ అని బ్యూరో ఆఫ్ సౌత్, సెంట్రల్ ఆసియా వ్యవహారాల యూఎస్ స్టేట్ డిపార్టమెంట్‌ శుక్రవారం ట్వీట్‌ చేసింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులతో పాటు పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్‌ టీకా డ్రైవ్‌ను ప్రారంభించింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
దీంతో టీకా డ్రైవ్‌ను ప్రారంభించి.. తొలిదశలో ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ వేస్తోంది. అలాగే పొరుగు దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. ఇప్పటికే భూటాన్‌కు 1.50లక్షల డోసులు, మాల్దీవులకు లక్ష డోసులు, బంగ్లాదేశ్‌కు రెండు 20లక్షలు, నేపాల్‌కు పది లక్షల డోసులను ఉచితంగా పంపింది. అలాగే మయన్మార్‌తో పాటు షీసెల్స్‌ దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేయనుంది. శ్రీలంక సైతం సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌కు టీకాలు సరఫరా చేయనుండగా.. ఆ దేశ డ్రగ్‌ రెగ్యులరేటరి ఆమోదం కోసం నిరీక్షిస్తోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ మాట్లాడుతూ భారత ప్రపంచవ్యాప్తంగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ ఉంటుందన్నారు. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. 

Related Posts