YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నంకు మరో మణిహారం ఐకాన్ బ్రిడ్జి ..

విశాఖపట్నంకు మరో మణిహారం ఐకాన్ బ్రిడ్జి ..

విశాఖపట్టణం జనవరి 23
వీలైనంత త్వరలో పరిపాలనా రాజధానిని విశాఖకి తరలించే ప్రయత్నాల్లో భాగంగా విశాఖపై ఏపీ ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైన అభివృద్ధి కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులుపెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా విశాఖ సి పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి.  ఈ రహదారిపై భీమిలి వద్ద గోస్తనీ నది పై నిర్మించనున్న బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. దీని కోసం అధికార యంత్రాంగం డిపిఆర్ రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది.ఈ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 50 కిలోమీటర్ల పొడవునా కొనసాగే ఆరు లైన్ల ఈ కోస్టల్ హైవే నిర్మాణంలో భాగంగా భీమిలి వద్ద ఉన్న గోస్తనీ నదిపై సుందరమైన వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. గోస్తని నదిపై నిర్మించే ఈ వంతెన విశాఖకు ఓ ఐకాన్ గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి తన ఆలోచనను బయటపెట్టారు. ఈ కోస్టల్ హైవే నిర్మాణానికి అవసరమయ్యే కేంద్ర నిధులు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ప్రతిపాదనలు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.అలాగే ఈ ఐకాన్  వంతెన నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. వీటి కోసం అవసరమైన డిపిఆర్ లను రూపొందిస్తోంది. బంగాళాఖాతం వెంబడి వీటి నిర్మాణాలు జరగనున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణులతో అధ్యయనం జరుగుతోంది. గోస్తనీ నది బంగాళాఖాతంలో కలుస్తున్న సంగమం మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి వెళ్తుంది. ఈ నేపథ్యంలో నదిపై నిర్మించబోయే వంతెన భారీగా ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డీపీఆర్ రూపొందుతోంది.. ఈ ఐకాన్ బ్రిడ్జ్ కోసం విశాఖ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Related Posts