జగత్తు అనే సముద్రం నుంచి సంపద కోసం మనలోని సద్గుణాలు .దుర్గుణాలు .అనే దేవతలూ.రాక్షసులూ. చేసే నిరంతర మధనమే క్షీరసాగర మధనం సర్వ సంపదలకు లక్ష్మీ అధిష్టాన దేవత ఇంద్రియ నిగ్రహం శాంతం సుశీలత్వం వంటి సద్గుణాలకు ఆధారమైన సర్వ మంగళ ఆమె మోహం.లోభం.కామం.క్రోధం.మధం.మత్సర్యం. వంటి దుర్గుణాలు లేని దేవత అష్టలక్ష్మి సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు లక్ష్మీ అనుగ్రహం లభించాలని అంటే ఎలా ఉండాలి ?లక్ష్మీ ఉంటే చోట్లు ఏవి అనే విషయం లో పురాణాలు స్మృతులు ఇచ్చిన వివరాలు ఇవి ప్రాత కాల సంధ్యలో నూ సాయంకాల సంధ్యలోనూ లక్ష్మి ఉండదు దేవతారాధన శుచి శుభ్రత .వేదవిహిత ధర్మపాలన జరిగే ఇళ్ళల్లో లక్ష్మీ ఉంటుంది మాతాపితరులు గురువులు పూజించబడే ఇల్లు శుభ్రపరిచిన ముంగిలి .వాకిలి .ద్వారం .గోవులు.... ఇవన్నీ లక్ష్మీ నివాసాలే ఎక్కడైనా కలకలలాడుతూ అనిపిస్తే "లక్ష్మీకళ" ఉట్టిపడుతుంది అంటాం అదే అమ్మ కొలువు ఉన్నదనడానికి నిదర్శనం ధనం .ధాన్యం --ఇవన్నీ అమ్మ రూపాలే ధనాశ లేని యోగులకి వారు యోగ శక్తే లక్ష్మి. కలహాలు ఉండేచోట లక్ష్మీ తొలగి అలక్ష్మి నెలకొంటుంది అప్రయత్నం. సోమరితనం. లక్ష్మి కి వీడ్కోలు చెబుతాయి స్త్రీలు దుఃఖ పడేచోట లక్ష్మి ఉండదు సుఖ సంతోషాలతో శక్తియుక్తులతో ఉండే వారి వెంట లక్ష్మి ఎల్లవేళలా ఉండి వారు సంపన్నులు కావడానికి అన్ని విధాలా సహకరిస్తుంది
ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే