వార్తలు దేశీయం
ఎలాంటి యుద్ధం చేయకుండానే చైనా అగ్రదేశాలకు చుక్కలు చూపిస్తుంది. చైనా చేసిన ప్రకటనే ఇప్పుడు అగ్రదేశాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దీనికి కారణం చెత్త అంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసే యూనిట్లు భారీగా వున్నది చైనా లోనే. చైనా తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక వస్తువులపై ధరలు బాగా పెరిగే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతుంది. ప్లాస్టిక్, స్టీల్ వేస్ట్, పేపర్ వంటివి అమెరికా నుంచి 30 శాతం బ్రిటన్ నుంచి 100 శాతం చెత్త ఇప్పటిదాకా చైనా కొనుగోలు చేసుకునేది. తాజాగా వీటి కొనుగోలుకు బ్రేక్ పడితే రీసైక్లింగ్ ఛాన్స్ లేని వస్తువులనే అగ్రదేశాలు తయారు చేసుకోవాలిసివుంది. దాంతో భారీగా ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా నిర్ణయంతో దేశంలో ప్లాస్టిక్ ఇతర కొన్ని తరహా వస్తువులను నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఈ చెత్తను కొనుగోలు చేసి రీసైక్లింగ్ ద్వారా తక్కువ ధరలో వస్తువులను ఉత్పత్తి చేసే సామర్ధ్యం చైనా సొంతం. అలాంటి చైనా ఇతర దేశాల చెత్త కొనుగోలుకు ఇప్పుడు నో చెప్పేసింది. దాంతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.ఇక ఆస్ట్రేలియా సైతం ఇప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలో తర్జన భర్జన పడుతుంది. మరోవైపు వియత్నాం, బెల్జియం వంటి కొన్ని దేశాలు రీసైక్లింగ్ తాము చేస్తామని ముందుకు రావడంతో అగ్రదేశాలకు కొంత ఊరట లభిస్తుంది. సింగపూర్ ఇలాంటి పరిణామం ముందే వూహించడంతో సొంతంగా రీసైక్లింగ్ మొదలు పెట్టి తనపని తాను ఎప్పటినుంచో చేసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాల చెత్త రీసైక్లింగ్ చేసుకోవడమే కావడం చర్చనీయాంశం అవుతుంది. పర్యావరణ ప్రేమికుల ఆందోళనలు భవిష్యత్తులో నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కవ్వించైనా మారాల్సిందే...!!