YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ గూటికి కళా

బీజేపీ గూటికి కళా

శ్రీకాకుళం, జనవరి 25, జేపీ ఇపుడు రైట్ డైరెక్షన్ లోనే వెళ్తోంది. ఎందుకంటే ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజును ఎంపిక చేయడమే కారణం. సోము ఆర్ఎస్ఎస్ నేపధ్యం కలిగిన నాయకుడు మాత్రమే కాదు ఏపీలో బీజేపీని పటిష్టం చేయాలన్న పంతం పట్టుదల కలిగిన వాడు. మరో వైపు టీడీపీ పొడ బొత్తిగా గిట్టని వాడు, కలలో అయినా చంద్రబాబుతో కలవని వాడు. దాంతో ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోవడానికొ సోము వేగంగా పావులు కదుపుతున్నారు. అవి అటు తిరిగి ఇటు తిరిగి ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెను సవాల్ గా మారనున్నాయి అంటున్నారు.ఏపీ టీడీపీలో సీనియర్ మోస్ట్ నేత, ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకటరావు మీద బీజేపీ కన్ను పడింది. ఆయనకు ఉత్తరాంధ్రలో మంచి బలం, బలగం ఉంది. పైగా ఆయన బంధువులు శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా ఉన్నారు. వారంతా రాజకీయాల్లోనే ఉన్నారు. ఒక్క కళా వెంకట్రావును కదిలిస్తే బెటాలియన్ మొత్తం అటు నుంచి ఇటు తిరుగుతుంది అంటున్నారు. అందుకే సోము వీర్రాజు బుర్ర పాదరసంలా పనిచేస్తోందని చెబుతున్నారు. కళా వెంకట్రావును ఇంటిని వెళ్ళి మరీ కాషాయం కండువా కప్పడానికి సోము రెడీ అయిపోయారు.టీడీపీలో కళా వెంకటరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన గతంలో మాదిరిగా పార్టీలో చురుకుగా లేరు అంటున్నారు. కళా వెంకటరావుని దించేసి ఆయనకు సొంత పార్టీలో ప్రత్యర్ధి అయిన అచ్చెన్నాయుడుకి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం చంద్రబాబు పెట్టారు. నాటి నుంచే కళా వెంకట్రావు రగిలిపోతున్నారు అంటున్నారు. చంద్రబాబు తనను అవమానపరచారని కూడా ఆయన కుములుతున్నారు. తనకంటే జూనియర్ అయిన అచ్చెన్నకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. చాన్స్ దొరికితే టీడీపీకి బాబుకు గట్టి ఝలక్ ఇవ్వాలని కూడా కళా వెంకట్రావు డిసైడ్ అయ్యారని అంటున్నారు.ఇదిలా ఉంటే కళా వెంకటరావుతో పాటు ఉత్తరాంధ్రాలో ఉన్న మాజీ మంత్రి పడాల అరుణను కూడా టీడీపీ నుంచి వేరు చేయాలని సోము వీర్రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఆమె కూడా కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత. ఆమె వస్తే గజపతినగరం విజయనగ‌రం నియోజకవర్గాల్లో బీజేపీకి ప్లస్ అవుతుంది. అదే టైంలో టీడీపీకి భారీ షాక్ తగులుతుంది. ఇక విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను కూడా బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాట. అందరి కంటే ముందు పెద్ద తలకాయ కళా వెంకట్రావును పార్టీలోకి తెస్తే ఉత్తరాంధ్రాలో టీడీపీ కోటను కుప్ప కూల్చవచ్చునని సోము పెద్ద ఎత్తులే వేస్తున్నారు. కానీ కళా వెంకట్రావు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. బీజేపీ మైండ్ గేమ్ లో భాగంగా తన పేరును తెరపైకి తెచ్చిందంటున్నారు. తాను బతికున్నంత వరకూ టీడీపీ వెంటే ఉంటానని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts