YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ ఆళ్లగడ్డ లొల్లి..

మళ్లీ ఆళ్లగడ్డ లొల్లి..
చంద్రబాబు పంచాయతీ చేసిన వివాదం సమసిపోలేదు. ఆళ్లగడ్డలో మరోసారి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏపీ మంత్రి అఖిలప్రియ, దివంగత భూమా అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య పోరు ఆగలేదు.భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు కలసి పనిచేయాలని సూచించారు. విభేదాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని ఇద్దరికీ క్లాస్ కూడా పీకారు. ఏవీ సుబ్బారెడ్డికి కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు సమావేశం తర్వాత బయటకు వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరం కలసి పనిచేస్తామని మీడియాకు తెలిపారు. ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దని ఏవీకి చంద్రబాబు సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రి పదవిని దక్కించుకున్న అఖిలప్రియ తనను పక్కన పెడుతుందని భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన అఖిలప్రియకు వ్యతిరేకంగా ఇటీవల ఏవీ హెల్ప్ లైన్ ను కూడా ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అఖిలప్రియ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు.టీడీపీ నేతల సైకిల్ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డి మీద అఖిలప్రియ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. తనపై అఖిలప్రియ కావాలని రాళ్లదాడి చేయించారని, దీనిని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఏవీ చెబుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో పరిస్థిితి మళ్లీ మొదటికొచ్చింది. చంద్రబాబు కు ఫోన్ లో చెప్పేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. కాని వీలు కాలేదు. రాళ్లదాడితో తాను షాక్ కు గురయ్యానని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. తనపై దాడి చేసింది అఖిలప్రియ వర్గీయులేనని ఏవీ ఆరోపిస్తున్నారు. భూమా కుటుంబం కోసం తన జీవితాంతం పనిచేశానని, 35 ఏళ్లు భూమా వెంటనే ఉన్నానని, కాని తనపైనే దాడి చేయడాన్ని తాను తట్టుకోలేక పోతున్నానన్నారు. తానేంటో అఖిలప్రియకు త్వరలోనే చూపిస్తానని ఏవీ సవాల్ విసరడం విశేషం. మొత్తం మీద నంద్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయనే చెప్పాలి.

Related Posts