YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్డీ బలపడుతున్నారా

యడ్డీ బలపడుతున్నారా

బెంగళూర్, జనవరి 25, 
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నారు. మూడో దఫా మంత్రి వర్గ విస్తరణను చేపట్టారు. అయితే విస్తరణ తర్వాత యడ్యూరప్పపై మరింత అసంతృప్తి తలెత్తింది. పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు యడ్యూరప్ప విస్తరణ జరపడంతో కొంతకాలం యడ్యూరప్ప పదవికి ఢోకా ఏమీ లేదని తేలింది. తొలి నుంచి తాను పట్టుబడుతున్న వారిలో కొందరికి యడ్యూరప్ప అవకాశం కల్పించారు.
యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడటానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమే. అందుకే వారికి మంత్రి పదవులు ఇవ్వాలని యడ్యూరప్ప తొలి నుంచి పట్టుబడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయిన వారిని, పోటీ చేయలేకపోయిన వారికి యడ్యూరప్ప ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. కానీ వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీలో ఒక వర్గం అంగీకరించలేదు. దీంతో అధిష్టానం కొన్ని నెలల పాటు మంత్రివర్గ విస్తరణను పక్కనపెట్టింది.చివరకు యడ్యూరప్ప అమిత్ షాతో భేటీ అయి మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. తన ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించిన ముగ్గురికి యడ్యూరప్ప తన కేబినెట్ లో స్థానం కల్పించారు. దీంతో అసంతృప్తి మరోసారి తలెత్తింది. తొలి నుంచి యడ్యూరప్ప ఆలోచనను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేత బసవగౌడ యత్నాల్ నిప్పులు చెరిగారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికే యడ్యూరప్ప పదవులు ఇచ్చారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించడం విశేషం.అయితే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన తర్వాత అసంతృప్తి మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకానొక దశలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యమంత్రి యడ్యూరప్పపై విశ్వనాధ్, అరవింద బెల్త్, సతీష్ రెడ్డి, రామదాసు, తిప్పారెడ్డి, రేణుకాచర్యా, రాజుగౌడ వంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మున్ముందు ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.

Related Posts