YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

హామీలతో ముంచేస్తున్న స్టాలిన్

హామీలతో ముంచేస్తున్న స్టాలిన్

చెన్నై, జనవరి 25, 
తమిళనాడు ఎన్నికలు సమీపిిస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో విజయం ఎవరిదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే డీఎంకే అధినేత స్టాలిన్ మాత్రం మానసికింగా విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. తానే తమిళనాడుకు ముఖ్యమంత్రినన్న విశ్వాసం స్టాలిన్ లో అడుగడుగునా కన్పిస్తుంది. రజనీకాంత్ రాజకీయాల్లో రానుంటూ ప్రకటన చేయడంతో స్టాలిన్ లో ఉత్సాహం మరింత రెట్టింపయింది.అందుకే ఆయన ప్రచార సభల్లోనూ హుషారుగా కనిపిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. అందుకే స్టాలిన్ ఈ ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం ఇస్తున్న సలహాలను, సూచనలను తూచ తప్పకుండా అమలుపరుస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం స్క్రిప్ట్, డైరెక్షన్ లోనే స్టాలిన్ నడుస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు.మరోవైపూ కూటమిలో పార్టీలను సంతృప్తి పర్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా స్టాలిన్ కు కూటమిలోని పార్టీలే ఇబ్బందికరంగా మారాయి. ఎక్కువ స్థానాలను ఆశ్రయిస్తుండటంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో కూటమిలోని పార్టీకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్థానాలను తక్కువగా తీసుకున్న పార్టీలకు తామేం భవిష్యత్ లో ప్రయోజనాలను చేకూరుస్తామన్న విషయాన్ని కూడా స్టాలిన్ చెబుతున్నారు.ఇలా ఉండగా స్టాలిన్ హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన రైతు రుణమాఫీని ప్రకటించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం రైతు రుణ మాఫీ ఫైలుపైనే చేస్తానని స్టాలిన్ ప్రకటించారు. అన్నాడీఎంకే పై అసంతృప్తి ఉండటం, కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికను కూడా ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద స్టాలిన్ తానే తమిళనాడుకు తదుపరి ముఖ్యమంత్రినని ఫిక్స్ అయిపోయినట్లే కన్పిస్తుంది

Related Posts