YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

పవన్ కు మెగా ఫ్యామలీ అండ....!!

పవన్ కు  మెగా ఫ్యామలీ అండ....!!
నా పేరు సూర్య’ ఆడియో ఫంక్షన్‌లో జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు, నటుడు నాగబాబు మళ్లీ తన స్వరం వినిపించారు. కుళ్లు రాజకీయాలు, కుతంత్రాలు చేసేవారి దుమ్ము దులపడానికి వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఒక్కడే అనుకోండి. ఆయన వెనుక చాలామంది పవన్ కళ్యాణ్‌లు ఉన్నారు. దేవుడు మాకు బోలెడంత డబ్బు ఇచ్చాడు. స్కాములు చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజా సేవలోకి వచ్చి నిస్వార్థంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నాం. ఎలా చేయాలో మాకు తెలుసు. ఒకసారి కుదరలేదు. ఈసారి కుదురుతుంది. అప్పుడు ఒక్కొక్కడికీ ఉంటుంది’’ అని తెలిపారు. అన్నీ వదులుకుని ప్రజల బాగు కోసం వస్తున్న కొందరు వ్యక్తులు, పార్టీలు ఆయన్ను తొక్కేసే ప్రయత్నాలు ఫలించక తమ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు దుర్భషలాడిస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘‘మా అందరికీ జీవితాన్ని ఇచ్చింది మా అన్నయ్య చిరంజీవి. నేను గానీ, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గానీ, నా కుమారులు గానీ, అరవింద్‌కు గానీ లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో నంబరు వన్ పొజీషన్‌లో ఉండి, కోట్లు వదిలి నిస్వార్థంగా ప్రజల సేవలోకి వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తిపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారు’’ అని అన్నారు‘‘. సినిమా పరిశ్రమలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండి కోట్ల రూపాయల సంపాదన కూడా తృణప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం వెళుతున్నాడు పవన్‌కల్యాణ్‌. మేం సినిమా పరిశ్రమలో ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. కానీ కల్యాణ్‌బాబు అన్నింటినీ తెంచుకొని ప్రజల ముందుకు వచ్చాడు కదా, అందుకే మామీద ఎన్నో కుతంత్రాలు, కుయుక్తులు, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అలాంటివాడు వస్తే మా అందరి వేషాలు సాగవు కదా అనే వాళ్ల భయం. ఎవరైతే రాకూడదని కోరుకొన్న వ్యక్తులు, పార్టీలు ఉన్నాయో వాళ్లంతా రకరకాల కుయుక్తులు, ప్రణాళికలతో తొక్కేసి... ఏమీ చేయలేక కుటుంబాల్ని నోటికొచ్చిన దుర్భాషలాడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లందరి దుమ్ము దులిపేలా రాబోతున్నాడు పవన్‌కల్యాణ్‌’’ అన్నారు.

Related Posts