YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అరుణాచలం: ధర్మసందేహాలు- సమాధానం

అరుణాచలం: ధర్మసందేహాలు- సమాధానం

ప్ర: సుందరకాండలో హనుమంతుని సముద్రలంఘన సందర్భంలో శ్రీరాముని పూర్వీకులను పొగడి విశ్రాంతి కోసం కృతజ్ఞతగా మైనాకుని ప్రేరేపించిన సముద్రుడు - సేతుబంధన సందర్భంలో ఎందుకు భీష్మించుకున్నాడు? తిరిగి రాముడు కోపోద్రిక్తుడై కోదండాన్ని ధరిస్తే కానీ కాళ్లబేరానికి రాలేదు. ఎందుచేత?
జ. తన ప్రాకృతిక గుణాన్ని ఉపసంహరించుకోలేనని విన్నవించుకున్నాడు. తిరిగి - రామానుగ్రహంతోనే వారధి బంధనానికి అనుకూలుడయ్యాడు. రాముడు నిష్కారణంగా కోదండాన్ని సంధించడు. ఇప్పుడు ఆయన కోదండాన్ని సంధించేలా చేసి, అటుపై శరణు వేడాడు. శరణాగతులను మన్నించే ఉదారుడు రాముడు. కానీ సంధించిన శరాన్ని వెనుదీయడు. 'దీనిని ఎవరిపై ప్రయోగించాలి?' అని ప్రశ్నించాడు. సాగర తీరంలోని ఒక ప్రాంతంలో (ద్రుమకుల్యలు) కొందరు రాక్షసులు తమ అధర్మ వర్తనతో సముద్రుని ప్రాకృతిక నియమాలకు వ్యతిరేకంగా హింసిస్తున్నందున, వారిపై ప్రయోగించమని రాముని వేడుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు ఆ బాణాన్ని సంధించి ఆ రాక్షసుల్ని సంహరించాడు. రామునిచే శరసంధానం చేసి, ఈ శుభప్రయోజనాన్ని సాధించడానికే సాగరుడు ఆగి ఉన్నాడు. ఇంతేకాక - శ్రీరామునిలో నున్న సర్వభూత శాసక శక్తి లోకానికి ప్రకటించడం కూడా ఒక ప్రయోజనం. ఈ గిరిజన తెగ రామ భక్తి ముందు హనుమంతుడు కూడా చాలడు.. రాముడికి కష్టమొస్తే ఉడుత కూడా బుడత సాయం చేసిందని విన్నాం....రాముడు తన వద్దకు వస్తాడని శబరి నిరీక్షించిన కథ కూడా చదివాము...ఐతే రాముడి నుంచి తమను ఏ శక్తి కూడా వేరు చేయలేదని నిరూపిస్తూ వళ్లంతా రామ నామంతో పచ్చ బొట్లు పొడిపించుకొంటోంది ఓ గిరిజన తెగ. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ రాముడి మీద తమకున్న అపార భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తోంది . ఈ గిరిజనుల రామభక్తి ముందు హనుమంతుడు కూడా చాలడేమో అనిపిస్తుంది వారిని చూస్తే. 
కింద ఫొటోలలో కనిపిస్తున్న గిరిజన తెగ పేరు రామ-నామి తెగ . ఛత్తీస్ ఘడ్ అడవుల్లో  నివసించే ఈ ప్రజలు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ రాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటారు . ఈ సమాజాన్ని ఏ యుగంలోనో శ్రీ రాముని ఆలయానికి వెళ్ళడానికి అనుమతించలేదు. అప్పుడు ఈ తెగ  పూర్వీకులు రాముడిని మా నుండి లాక్కోలేరని చెప్పి  ఇలా ఒళ్ళంతా రామ నామాన్ని పొడిపించుకుంటారు. కనురెప్పలను సైతం రామనామంతో నింపేసుకున్నారు.ఇప్పటికీ ఈ తెగ  ప్రశాంతంగా జీవిస్తున్నారు. కేవలం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడమే కాదు. వారి జీవన విధానంలోని ప్రతీ పనిని, ప్రతీ శుభకార్యాన్ని రామ నామంతోనే ముడి పెడతారు. ఈ విధంగా, రాముడి పేరును పొందే సంప్రదాయాన్ని ఈ తెగలో ఆమోదించుకొన్నారు . ఈ ప్రజలు బలమైన రామపంతిలు. ఇప్పుడు ఈ తెగ ప్రజలు కూడా ఆలయానికి వెళతారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాని రామ్ పేరు రాసే సంప్రదాయం ఈ రోజు వరకు మారలేదు. 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts