YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం ఆడించినట్టు ఆడుతున్నల ఉద్యోగులు - మాజీ మంత్రి లనంద బాబు

ప్రభుత్వం ఆడించినట్టు ఆడుతున్నల ఉద్యోగులు - మాజీ మంత్రి లనంద బాబు

గుంటూరు జనవరి 25,  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. రాజ్యాంగం అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగుస్తుంది. రెండు స్వాతంత్ర్య వ్యవస్థలను పట్టించుకోకుండా జరుగుతున్న తీరు బాధాకరమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. స్వాతంత్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుంది. దేశంలో ఇలాంటి పరిణామాలు ఎన్నడూ చూడలేదు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఒక నిర్ణయం తీసుకున్నా తర్వాత ఉద్యోగులు కమీషన్ ఆధీనంలోకి వెళ్తారు. గతంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఎప్పుడూ బయటకు రాని ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అనేక చోట్ల ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మాత్రం కరోనా ను సాకుగా చూపి ఎన్నికలను అడ్డుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించినట్టే. ఈ సంక్షోభం ఏ దిశగా వెళ్తుందో చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు చెప్పినా సహకరించం అని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఆడించినట్టు ఉద్యోగులు ఆడుతున్నారు. కేంద్రం కూడా ఎన్నికల విషయంలో దోబూచులాడుతుంది. ఎస్ఇసికి టిడిపి కి సంబంధం లేదు. అలా ఉంటే వైసిపి ఎక్కడా ఎకగ్రీవాలు కావు. ప్రజాస్వామ్య వాదులు దీని పై ఆలోచన చేయాలి. ఎన్నికల కమీషన్ విధుల్లో ప్రభుత్వ జోక్యం తగ్గించుకోవాలి. టిడిపి నాయకులు నామినేషన్ లు వేయడానికి సిద్దంగా ఉన్నారు. నామినేషన్ లు వేసేందుకు టిడిపి నాయకులు కార్యకర్తలు కార్యాలయాల వద్దకు వెళ్తారు. విద్యార్దులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం సిగ్గుచేటని అయన అన్నారు.

Related Posts