ఎమ్మిగనూరు పట్టణంలో ప్రజలు విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు పట్టణంలోనే ఏర్పాటు చేయాలని ,34 వార్డు ప్రజలు సబ్ స్టేషన్కి వెళ్లి బిల్లులు చెల్లించాలంటే ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వార్డు సచివలయాల దగ్గర ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ సమితి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం విద్యుత్ అధికారి వీరేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ సహాయ కార్యదర్శి జి.హనుమంతు అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి తిమ్మగురుడు, మండల కార్యదర్శి సత్య న్న,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తేరు బజార్ నందు విద్యుత్తు బిల్లులు చెల్లించే కేంద్రం ఉండేదని,అక్కడ సెంటర్ లేకపోవడం శివారు కాలనీల ప్రజలు సబ్ స్టేషన్ కు రావాలంటే పనులు వదులుకొని బిల్లులు చెల్లచేందుకు రావాలంటే ఆటో చార్జీలు,వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని,బిల్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని,పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర కంచె లేక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ,శివసర్కిల్ చెన్నారెడ్డి కాంప్లెక్స్, ఎద్దుల మార్కెట్ దగ్గర ,కటిక పేట మైదానం,లక్ష్మీపేట దగ్గర ,పెద్దకళ్ళు పెంటదగ్గర,ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ గోనెగండ్ల బైపాస్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్స్ తనిఖీ చేసి కంచె ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రములో సిపిఐ నాయకులు కె.సి.జబ్బార్, బాలరాజు, విజేంద్ర,అనిఫ్,మునిస్వామి, ఖాజా, విజయ్,ఎం.రాముడు ,నబీసాబ్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.