YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి - సీపీఎస్ ని రద్దు చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి

పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి - సీపీఎస్ ని రద్దు చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి

ఉద్యోగ, ఉపాధ్యాయలకు మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పీఆర్సీ ని అమలు చేసి, ఎన్నికలలో  సీపీఎస్  విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు  యన్.వెంకటేశ్వర్లు, యన్.నాగమణి, రాష్ట్ర కార్యదర్శి కె.సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరులోని శివసర్కిల్ నుండి జరిగిన ర్యాలీ అనంతరం ఉప్పర కమ్యూనిటీ హాల్ లో జిల్లా అధ్యక్షులు జె.యల్లప్ప అధ్యక్షుతన జరిగిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరైన  రాష్ట్ర సహాధ్యక్షులు యన్.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ "  గత ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మరియు పిఆర్సి ని ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అదేవిధంగా వాయిదాల పద్ధతిలో డి ఏ లు చెల్లించడం వండి ఏకపక్ష నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని మరియు రేషనలైజేషన్ లో పోస్టులు బ్లాకింగ్ చేయడం తగదని విమర్శించారు.


రాష్ట్ర సహాధ్యక్షులు యన్. నాగమణి గారు మాట్లాడుతూ "  " కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని,  అదేవిధంగా ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేయడం తగదని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుతూ, ప్రజాసంక్షేమాన్ని కాపాడే చట్టాలను చేసే ఆలోచన కలిగి ఉండాలన్నారు.


రాష్ట్ర కార్యదర్శి కే సురేష్ కుమార్ మాట్లాడుతూ " విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలం అయ్యాయని ఆక్షేపించారు. మాట తప్పను, మడమ తిప్పను అని ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ఉదృతమైన పోరాటాలకు సిధ్ధం కావాలని "  పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యస్.యం.జయరాజు, యన్.శాంతిప్రియ, ఎ.యం.డి.రఫిక్, జి.హేమంత్ కుమార్, జాకీర్ హుస్సేన్, యెహోషువ, అబ్దుల్ లతీఫ్, సుబ్బారెడ్డి, క్రిష్ణమూర్తి, యం.వెంకటేశ్వర్లు, మూర్తుజావలి, పి.వి.ప్రసాద్, బాబా ఫక్రుద్దీన్,సుధాకర్, నాగస్వామి నాయక్, నవీన్ పాటి యాదవ్, అమీర్ అహ్మద్, వీరారెడ్డి కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts