YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అమ్మపాలెం అవ్వ కు అండగా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్

అమ్మపాలెం అవ్వ కు అండగా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్

వెంకటగిరి మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వయసు కలిగిన అవ్వకు మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత మౌనికా రెడ్డి అండగా నిలిచారు. గ్రామంలోనే ఆమె కన్న బిడ్డలు ఉండి కూడా ఆమె ఆలనా పాలనా  చూసుకోకుండా ,ఇటు గ్రామస్తులు అటు ప్రభుత్వం పట్టించుకోకుండా,ఇల్లు లేకుండా గుడిలో లేదా బడిలో జీవనం కొనసాగిస్తున్న వెంకటగిరి  మండలం, అమ్మపాలెం గ్రామానికి చెందిన 90 ఏళ్ల నిరుపేద లక్ష్మమ్మ అనే వృద్ధురాలికి నేనున్నానంటూ మౌనిక రెడ్డి  ముందుకు వచ్చారు .మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత్రి, మేనేజింగ్ ట్రస్టీ మౌనిక రెడ్డి , 2 నెలల క్రితం తుఫాన్ లకు గురై అవ్వ ఇల్లు నీటిలో మునిగిపోయి ఉన్న స్థితిని సోషల్ మీడియాలో గమనించిన స్పందించి  వెంటనే హరి అనే తన ట్రస్టు వాలంటీర్ ను, అమ్మపాలెం గ్రామానికి పంపించి ,అవ్వ మంచిచెడులు తెలుసుకొని ఆమెకు ఒక రైస్ బ్యాగ్, ఒక దుప్పటి, రెండు చీరలు, కొంత నగదు అందించారు. ఆ రోజు ఫోన్ ద్వారా తాను త్వరలో అమ్మపాలెం గ్రామానికి వచ్చి వ్యక్తిగతంగా కలిసి తన ట్రస్టు ద్వారా సహాయం అందిస్తానని చెప్పిన మాటకు కట్టుబడి, మౌనిక రెడ్డి అమ్మపాలెం గ్రామానికి వెళ్లి లక్ష్మమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలిని  కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు.  మౌనిక రెడ్డి లక్ష్మణ్ బోకు శాలువా కప్పి పూల గుత్తి అందించి అవ్వ ఆశీస్సులు తీసుకున్నారు. పది కాలాలపాటు చల్లగా ఉండాలని  మౌనిక రెడ్డి ని లక్ష్మమ్మ పట్టలేని ఆనందం తో దీవించారు. ఈ సందర్భంగా  మౌనిక రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,లక్ష్మమ్మ లాంటి నిరుపేదలకు సహాయం చేయడానికే "మౌనికా చారిటబుల్ ఫౌండేషన్" ముందుకు పనిచేస్తుందని,తన ట్రస్టు తరఫున లక్ష్మమ్మ అవ్వకు ఎం సి ఎఫ్ స్కీం కింద నెలకు 2000/- వేల రూపాయల పెన్షన్, ఒక కట్ట బియ్యం ప్రతినెల   పంపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. అవ్వకు అవకాశం ఉంటే ప్రభుత్వం తరఫున లేకుంటే,తన ట్రస్టు తరఫున ఇల్లు కట్టించి ఇస్తానని లక్ష్మమ్మ  మౌనిక రెడ్డి భరోసా ఇచ్చారు. మౌనిక రెడ్డి రాకతో లక్ష్మమ్మ ఎంతో సంతోష పడింది. ఇంకా ఏమి కావాలి నీకు అని మౌనిక రెడ్డి అవ్వను అడుగగా,తనకు వంట చేసుకోవడానికి "గ్యాస్ స్టవ్" కావాలని కోరగా, అందుకు మౌనిక రెడ్డి అలాగే పంపిస్తానని చెప్పారు. సోషల్ మీడియా లో చూసిన వార్తకు స్పందించి,ఒక మారుమూల గ్రామంలో ఉన్న అనాధ నిరుపేద వృద్ధురాలు అయిన లక్ష్మమ్మ కు నేనున్నానంటూ,90 ఏళ్ళ వృద్ధాప్యంలో, బ్రతుకు పై ఆశలు కల్పించి సహాయం చేస్తున్న, ప్రముఖ సంఘ సేవకురాలు, మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, మేనేజింగ్ ట్రస్టీ  మౌనిక రెడ్డి సేవలు మరింత విస్తృతం కావాలని విస్తృతం కావాలని వ్యాప్తి చెందాలని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Related Posts