బాలికా రక్షణతోనే సమాజానికి, తద్వారా దేశానికి సంక్షేమం అని విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టరు తాళ్లూరి సువర్ణ కుమారి పేర్కొన్నారు. ఆదివారం బాలికా దినోత్సవ వేడుకలను నెల్లూరు నగరం లోని వాత్సల్య ఆశ్రమం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తాళ్లూరి సువర్ణ కుమారి మాట్లాడుతూ బాలిక జన్మించింది అంటే భయపడే రోజు లు పోయాయని, బాలికలు తమ ప్రతిభను చాటేందుకు సమాజంలో అన్ని రకాల అవకాశాలు ఏర్పడ్డాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యతో సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని అన్నా రు. బాలికలు ధైర్యం గా అన్ని రంగాలలో దూసుకు పోయి, మహిళా శక్తి ఆధిపత్యం చాటాలని సువర్ణ కోరారు. బాలికా సంరక్షణ లో ప్రతి ఒక్కరు, ప్రతి సేవా సంస్థ చొరవ తీసుకోవాలని కోరారు. వాత్సల్య ఆధ్వర్యంలోని బాలికలకు సువర్ణ దుప్పట్లు, విద్యోపకరణాలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి తాళ్లూరి ఆనంద్ కుమార్ ప్రతినిధులు జయ ప్రతాప్ రెడ్డి, హజరత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.