బుల్లెట్ కంటే, బ్యాలెట్ అంటే ఓటు మిన్న అని, ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తును మార్చవచ్చునని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో యన్.ఎస్. ఎస్. యూనిట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుతో సమర్ధవంతమైన నాయకుడ్ని ఎన్నుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం,వర్గం,భాష మరియు ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కామని, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి తెలియజేశారు. ఈ సందర్భంగా మురళిమోహన్ రాజు ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డికి శ్రీ స్వామి వివేకానంద జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.